Minister Ponguleti On Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై బిగ్ అప్డేట్ వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పథకంపై ఇటీవల కీలక ప్రకటన చేశారు. సొంత ఇళ్లు ఉన్నవారికి ఆరోజే రూ.5 లక్షలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన సమయం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు, సొంత ఇళ్లు ఉన్నవారికి రూ.5 లక్షలు ప్రకటిస్తామని చెబుతోంది. అంతేకాదు సొంత ఇంటి జాగా లేని వారికి కూడా స్థలాలను ఇప్పిస్తామని ప్రకటించింది.
నేడు ఈ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సొంత ఇల్లు ఉన్నవారికి నిధుల విడుదలకు కీలక సమాచారం అందించారు.
దశల వారీగా నియోజకవర్గాల్లో మొదటి దశలో 3500 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. అంతేకాదు దశలవారీగా సొంత ఇల్లు ఉన్నవారికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు.
ఈ పథకంలో ఇంటి యజమానిగా మహిళలనే గుర్తిస్తామని ప్రకటించారు. ఈ నెలాఖరులోపల ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారుల వివరాలను ప్రకటిస్తామని అన్నారు.
అయితే, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత సొంత ఇళ్లు ఉన్నవారికి నిధులు మంజూరు చేస్తామని గతంలో పొంగులేటి చెప్పారు. ఆ తర్వాత ఇళ్ల స్థలాలను కేటాయిస్తామన్నారు.