Hyundai Inster Cross EV Price: హ్యుందాయ్ కంపెనీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు ఇన్‌స్టర్ క్రాస్ EV విడుదల కాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌ను కంపెనీ వెల్లడించింది. అయితే దీని ధర, స్పెషిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి.
Hyundai Inster Cross EV Price: ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో అనేక ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కొత్త కార్లను పరిచయం చేస్తున్నాయి. ఈ ఎక్స్‌పోలో చిన్న చిన్న ఆటో కంపెనీలు కూడా మోటర్ సైకిల్స్, కార్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. అయితే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. హ్యుందాయ్ కంపెనీ ఇన్‌స్టర్ క్రాస్ EV కారును పరిచయం చేసింది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లాంచింగ్ డిటేయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లోబల్ ఎక్స్పో 2025లో హ్యుందాయ్ కంపెనీ త్వరలోనే విడుదల చేయబోయే ఇన్‌స్టర్ క్రాస్ EV కారును రివీల్ చేసింది. ఇది అద్భుతమైన డిజైన్‌తో పాటు ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్, ధరను కూడా వెల్లడించింది.
హ్యుందాయ్ ఇన్‌స్టర్ క్రాస్ EV కారు కాంపాక్ట్ ఫ్రేమ్‌వర్క్‌తో కూడిన అద్భుతమైన SUV లాంటి డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇన్‌స్టర్ క్రాస్ ఎలివేటెడ్ బ్లాక్ క్లాడింగ్‌తో ఈ కారు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారు ఆకర్శనీయమైన లుక్‌లో కనిపించేందుకు స్పెషల్ బంఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఈ కారుకు సంబంధించిన అల్లాయ్ వీల్స్ వివరాల్లోకి వెళితే.. ఇవి దాదాపు 17-అంగుళాల పాటు ఉండనున్నాయి. ఈ క్రాస్ఓవర్ వేరియంట్ కేవలం గ్రీన్ కలర్లో మాత్రమే మార్కెట్లో విడుదల కాబోతున్నట్లు సమాచారం. అలాగే కారు ఎంతో శక్తివంతమైన 49kWh బ్యాటరీతో విడుదల కానుంది. అంతేకాకుండా దీని ధర రూ. 30.53 లక్షలు ఉండబోతున్నట్లు సమాచారం.
హ్యుందాయ్ ఇన్‌స్టర్ క్రాస్ EV కారుకు సంబంధించిన ఇంజన్ 115bhp పవర్‌తో పాటు 147Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం 10.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు చేరుకుంటుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 360 కి.మీల రేంజ్ వరకు మైలేజీని అందిస్తుంది.
హ్యుందాయ్ కంపెనీ ఈ కారులో స్పెషల్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇందులో ADAS ప్యాకేజీని కూడా అందిస్తోంది. ఈ కారుకు సంబంధించిన హై ఎండ్ మోడల్స్‌లో ప్రత్యేకమైన ఫీచర్స్ లభిస్తున్నాయి.