Hyderabad Rains: హైదరాబాదీలకు వర్షం తెచ్చిన గుడ్‌న్యూస్.. దీపావళి పొల్యూషన్‌ మటాష్..

Hyderabad Diwali Pollution :‌ హైదరాబాద్‌వాసులకు చల్లని కబురు తెచ్చింది వర్షం. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు దీపావళి వల్ల ఏర్పడిన వాయు కాలుష్యానికి చెక్‌ పడినట్లయింది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతోపాటు నిన్న దీపావళి పటాకుల కాలుష్యం తోడవ్వడంతో గాలి నాణ్యత పడిపోయింది. నేడు కురుస్తున్న వర్షాలకు ఆ కాలుష్యానికి చెక్‌ పడుతుంది.
 

1 /5

హైదరాబాద్‌ పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భారీ వర్షం కురిస్తోంది. దీంతో దీపావళి వల్ల జరిగిన కాలుష్యానికి చెక్‌ పడినట్లయింది. వర్షం హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్‌ తెచ్చింది.  

2 /5

హైదరాబాద్‌లోని పలు చోట్లు నేడు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం పలు ప్రాంతాల్లో కురిసింది. దీంతో జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, పంజాగుట్ట వంటి పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం పడింది.   

3 /5

ఈ వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొత్తగూడ, మియాపూర్‌, అమీర్‌పేటలోని పలు ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయింది.  

4 /5

ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మరికొన్ని గంట్లో పడతాయని జీహెచ్‌ఎంసీ పరిధిలోని వాయువ్య, ఈశాన్య ప్రాంతాల్లో మరికొన్న గంటలపాటు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ కూడా హెచ్చరించింది.  

5 /5

ఈరోజు రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, దీపావళి వల్ల పటాకుల నుంచి వెలువడిన పొల్యూషన్‌ వల్ల ఎయిర్‌ క్వాలిటీ తగ్గిపోయింది. గాలి కాలుష్యం మరింత పెరిగింది. అయితే ఈ వర్షం వల్ల హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌ అందింది. ఒక్కసారిగా వాతావరణం కూడా చల్లబడింది.