Liver Health Foods: మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఎంత ముఖ్యమైనవో..లివర్ అంతకంటే ప్రాధాన్యత కలిగినవి. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. లివర్ ఆరోగ్యం చెడే ఆహారపు అలవాట్లు లేదా జీవన విధానానికి దూరంగా ఉండాలి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే 5 బెస్ట్ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం..
నువ్వులు నువ్వుల్లో ప్రోటీన్లు, విటమన్ ఇ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దాంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్‌ను డీటాక్స్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.
పుచ్చకాయ పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపీన్ లివర్‌ను సదా ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. లివర్‌లో ఏవైనా పోషకాల లోపం ఏర్పడితే వీటి ద్వారా నయమౌతుంది
కాలిఫ్లవర్ కాలిఫ్లవర్ ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. లివర్‌ను శుభ్రపర్చడంలో దోహదం చేస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్ పెద్దఎత్తున ఉండటం వల్ల లివర్ దెబ్బతినకుండా ఉంటుంది.
వెల్లుల్లి వెల్లుల్లి ఆయుర్వేద పరంగా అద్భుతమైన ఔషధం. ఇందులో ఉండే ఎలిసిన్ అనే రసాయనం లివర్‌ను శుభ్రపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కీరా కీరా లివర్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ అధికం. దాంతో శరీరంలోని విష పదార్ధాలు చాలా సులభంగా బయటకు తొలగిపోతాయి. లివర్‌ను క్లీన్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.