PM Jeevan Jyothi Bima Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. అన్నీ బీపీఎల్, మిడిల్ క్లాసు కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం (PM JJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PM SBY) గురించి మీకు తెలుసా? ఈ పథకాన్ని కేంద్రం 2015 లో ప్రారంభించారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ మాదిరి ఉపయోగపడుతుంది.
పీఎం జ్యోతి బీమా స్కీమ్ ఒక ఆరోగ్య బీమా పథకం. దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంలో చేరినవారు చనిపోతే డబ్బులను ఆ వ్యక్తి కుటుంబానికి అందజేస్తారు. అంటే పాలసీదారుడు ఆరోగ్య సమస్యలు, యాక్సిడెంట్ లేదా ఏ ఇతర కారణాల వల్ల అయినా చనిపోతే అతని కుటుంబానికి రూ.2,00,000 అందజేస్తారు. అయితే, ఈ స్కీమ్ సమయం పూర్తయిన తర్వాత కూడా పాలసీదారుడికి ఏ సమస్యలు రాకపోతే ఈ బెనిఫిట్ పొందలేడు.
ఈ పథకం ప్రతి ఏడాది రెనివల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ పథకానికి అర్హులు 18 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులు. ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రతినెలా పాలసీదారుడి ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి.
ఏడాదికి కేవలం రూ.436తో రూ.2,00,000 పొందే కేంద్ర ప్రభుత్వ అద్భుతమైన పథకం. గతంలో ఈ బీమా ధర రూ. 330 ఉండేది. ఆ తర్వాత ప్రీమియం రూ.436 కు పెంచారు.
ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకంలో చేరాలంటే దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ కలిగి ఉండాలి.ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్‌లైన్ లేదా నేరుగా ఎల్‌ఐసీ ఆఫీసుకు కూడా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
www.janasurasha.go.in/ ఆన్‌లైన్‌లో ఫారమ్ నింపి బ్యాంక్ లేదా పోస్టాఫీసులో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరిన తర్వాత 55 ఏళ్ల వయస్సు వరకు స్కీమ్ కట్టుకునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం బారిన పడినా బీమా డబ్బులు మీకు అందుతాయి.
ఈ పథకాన్ని నిర్వహించేది ఎల్‌ఐసీ. టర్మ్ ఇన్సూరెన్స్ కంటే కూడా దీని ప్రీమియం కూడా తక్కువ. జూన్ 1 నుంచి మే 31 వరకు లెక్కిస్తారు. ఈ సమయంలో చనిపోతే డబ్బులు కుటుంబానికి వస్తాయి. నామినీ డెత్ సర్టిఫికేట్, ఆసుపత్రి డిస్చర్జీ సర్టిఫికేట్ అవసరం అవుతాయి.
పీఎం జీవన్ సురక్ష యోజన అన్ని బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలేక పోతున్నారో వారికి ఇది ఎంతో ఉపయోగకరమైన బీమా. ఇప్పటికే ఎన్నో కోట్ల మంది ఈ పథకంలో చేరారు. బ్యాంకులో తప్పనిసరిగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఆధార్ అనుసందిచాలి. అంతేకాదు ఈ ఖాతాను ఒకరిపై ఒకటే బీమా కవరేజీ వస్తుంది.