Honey Bee: ఒంటిపైనే తేనెటీగల్ని పెంచుకునే వ్యక్తిని ఎప్పుడైనా చూశారా

ఒక్కొక్కరిదీ ఒక్కొక్క విచిత్ర అలవాటు. సమాజంలో ఇదే కన్పిస్తుంది. కొందరు ఒంటి నిండా టాటూలు పొడిపించుకుంటారు. మరి కొందరు పెయింటింగ్ వేస్కుంటారు. సెంట్రల్ ఆఫ్రికాకు చెందిన నాదిసాబా అనే ఈ వ్యక్తి మాత్రం ఏకంగా ఒంటిపై తేనెటీగల్ని పెంచుకుంటున్నాడు. విశేషమేమంటే ఇప్పటి వరకూ ఒక్క తేనెటీగ కూడా కుట్టలేదట..ఆ వివరాలు తెలుసుకుందాం.

Honey Bee: ఒక్కొక్కరిదీ ఒక్కొక్క విచిత్ర అలవాటు. సమాజంలో ఇదే కన్పిస్తుంది. కొందరు ఒంటి నిండా టాటూలు పొడిపించుకుంటారు. మరి కొందరు పెయింటింగ్ వేస్కుంటారు. సెంట్రల్ ఆఫ్రికాకు చెందిన నాదిసాబా అనే ఈ వ్యక్తి మాత్రం ఏకంగా ఒంటిపై తేనెటీగల్ని పెంచుకుంటున్నాడు. విశేషమేమంటే ఇప్పటి వరకూ ఒక్క తేనెటీగ కూడా కుట్టలేదట..ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

రాణి తేనెటీగ ద్వారా ఇతర తేనెటీగల్ని తన దేహంపైకి ఆకర్షింపచేయడం సులభమే కానీ వాటిని తొలగించేటప్ప్పుడే అసలు సమస్య ఎదురవుతుంది. మరో వ్యక్తి సహాయంతో రాణి తేనెటీగను తల చుట్టూ అమరేలా చేస్తాడు.

2 /5

ఈ నేపధ్యంలో ముక్కు, చెవుల్ని దూదితో కవర్ చేస్తాడు. లేకపోతే తేనెటీగలు వాటిలో దూరిపోయే ప్రమాదముంది. కళ్ల కింద, పెదవులకు వేజ్ లీన్ రాస్తాడు. దాంతో అవి పైకి రాకుండా నియంత్రించవచ్చు.

3 /5

ఈ వినూత్న అసమాన విధానంతో నాదిసాబా సుపరిచితమయ్యాడు. తన ఒంటిపై వచ్చే తేనెటీగల నుంచి వచ్చే తేనెతో మంచి ఆదాయం కూడా పొందుతున్నాడు. తేనెటీగలు తనను కుట్టకుండా ఉండేందుకు గానూ..మద్యమధ్యలో పంచదార నీటిని స్ప్రే చేస్తుంటాడు.

4 /5

తేనెటీగల్ని నియంత్రించేందుకు ముందుగా రాణి తేనెటీగను అణ్వేషించాల్సి వస్తుందని నాదిసాబా అంటున్నాడు. ఆ తేనెటీగను ఆకర్షించి తన ఒంటిపై ఉంచుకుంటాడు. ఈ కిటుకుతో అన్ని తేనెటీగల్ని తనవైపుకు ఆకర్షిస్తుంటాడు. రాణి తేనెటీగ తన ఒంటిని పట్టి ఉంచేందుకు ఓ చిన్న తాడు నడుము చుట్టూ కట్టుకుంటాడు. ఇంకేముంది ఆ తరువాత రాణి తేనెటీగ రక్షణ కోసం మిగిలిన తేనెటీగలన్నీ అక్కడికి చేరుతాయి. ఇప్పటి వరకూ ఒక్క తేనెటీగ కూడా తనను కుట్టలేదని చెబుతున్నాడు.

5 /5

రువాండాకు చెందిన నాదిసాబా గత 30 ఏళ్లుగా తన ఒంటిపై తేనెటీగల్ని పెంచుతున్నాడు. అందుకే ఎప్పుడూ సరైన ఒంటిపై సరైన బట్టలు ధరించడం లేదు. తేనెటీగల తుట్టె అతని ఒంటిపై ఓ కోటులా కన్పిస్తోంది. తేనెటీగలతో కప్పబడి ఉంటున్న ఇతని ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చిన తరువాత నాదిసాబా గురించి అందరికీ తెలిసింది.