Google 2024 Top Trending Serches for Overall: 2024లో గూగుల్ టాప్ ట్రెండ్ లో ఐపీఎల్.. ట్రెండింగ్ లో బీజేపీ పార్టీ..

Google 2024Top Trending Serches for Overall:2024 కు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు సగానికిపైగా దేశాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరాయి. 2024లో మన దేశంలో ఐపీఎల్ క్రికెట్ టాప్ లో నిలుస్తే.. ఎన్నికల నేపథ్యంలో ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎన్నికల ఫలితాలు టాప్ ట్రెండ్ లో నిలిచాయి.

1 /10

1.ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్).. ఈ యేడాది (2024) ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను  ఎక్కువ మంది భారతీయులు సెర్చ్ చేసిన పదం అని గూగుల్ తెలిపింది. 

2 /10

2. T20 World Cup: ఈ యేడాది మన దేశ ప్రజలు  గూగుల్ ఐపీఎల్ తర్వాత గూగుల్ లో ఎక్కువ మంది ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ను ఎక్కువ మంది వెతికినట్టు గూగుల్ ఇండియా తెలిపింది.

3 /10

3.భారతీయ జనతా పార్టీ.. 2024 ఎన్నికల్లో బీజేపీ పార్టీ చెప్పినట్టుగా 400 సీట్లు కాకుండా.. 240 సీట్లకే పరిమితం అయింది. అంతేకాదు వరుసగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి సంచలనం రేపింది.

4 /10

4. ఎలక్షన్ రిజల్ట్ 2024.. 2024లో మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఈ ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేశాయి. ఎక్కువ మంది ఈ రిజల్ట్ కోసం గూగుల్ లో సెర్చ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.

5 /10

5.ఒలింపిక్స్.. 2024 ఫ్రాన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో భారత దేశం తరుపున పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో వినేశ్ ఫొగాట్ ఇష్యూతో ఒలింపిక్స్ టాప్ ట్రెండింగ్ లో 5వ స్థానంలో నిలిచింది.

6 /10

6.ఎక్స్ సెవ్ హీట్..2024 గూగుల్ టాప్ ట్రెండ్ లో ఎక్సెసివ్ హీట్ టాప్ లో నిలిచింది.

7 /10

7.రతన్ టాటా.. టాటా గ్రూపుకు చైర్మన్ గా పనిచేసిన రతన్ టాటా తనువు చాలించిన నేపథ్యంలో ఆయన పేరు మన భారతీయులు ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసారు.

8 /10

8.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. దేశాన్ని సుధీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలిచి పదేళ్ల తర్వాత ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకుంది.

9 /10

9.ప్రో కబడ్డీ లీగ్.. 2024 గూగుల్ లో ప్రో కబడ్డీ లీగ్ టాప్ ట్రెండింగ్ లో టాప్ 9లో నిలిచింది.  

10 /10

10.ఇండియన్ సూపర్ లీగ్..  ఇండియర్ సూపర్ లీగ్ ఓవరాల్ గా మన దేశంలో టాప్ 10లో నిలిచింది. మొత్తంగా టాప్ 10లో టాప్ 5 క్రీడలకు సంబంధించిన అంశాలే ఉండటం విశేషం.