Google 2024 Search Trends for People: ప్రస్తుత స్పీడ్ ఇంటర్నెట్ నెట్ యుగంలో మనకు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే గూగుల్ (Google) వెతకడం కామన్ అయిపోయింది. అందులో సినిమాలు, రాజకీయాలు, క్రికెట్, ఇలా ప్రతి విషయమై గూగుల్ లో వెతకడం కామన్ అయింది. అయితే 2024లో మన దేశంలో ఎక్కువ మంది భారతీయులు వెతికిన పేర్లలో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంది. మొత్తంగా 2024 గూగుల్ సెర్చ్ ట్రెండ్ లో టాప్ లో నిలిచిన వ్యక్తుల సహా వివిధ అంశాలకు సంబంధించి గూగుల్ విడుదల చేసిన నివేదిక విషయానికొస్తే..
గూగుల్ సెర్చ్ లో ఈ యేడాది టాప్ లో పవన్ కళ్యాణ్ నిలిచారు. హీరోగా.. రాజకీయ నాయకుడిగా తనదైన ముద్రతో మన దేశంలో టాప్ లో నిలిచారు.
1. వినేశ్ ఫొగాట్ .. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పి హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలిచింది. ఈ యేడాది గూగుల్ ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఈమెనే.
2.నితిష్ కుమార్ .. 2024 సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా మూడో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. ముందు ఇండి కూటమిలో ఉండి.. ఆ తర్వాత ఎన్డీయే చేరారు. గూగుల్ టాప్ ట్రెండ్ లో టాప్ 2లో నిలిచింది.
3.చిరాగ్ పాశ్వాన్.. 2024 ఎన్నికల్లో బిహార్ లో బీజేపీ, జేడీయూలతో కలిసి కూటమిగా పోటీ చేసారు. అంతేకాదు పోటీ చేసిన ఐదు స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించిన నేతగా రికార్డు క్రియేట్ చేసారు. టాప్ 3లో నిలిచారు.
4. హర్దిక్ పాండ్యా.. భారత క్రికెట్ లో ఆల్ రౌండర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గూగుల్ టాప్ ట్రెండ్ లో 4వ స్థానంలో నిలిచారు.
5. పవన్ కళ్యాణ్.. జనసేన అధినేతగా తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ లతో కూటమిగా పోటీ చేసి 2 ఎంపీ, 21 శాసనసభ స్థానాల్లో పోటీ చేసిన వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన నేతగా రికార్డు క్రియేట్ చేసారు. అంతేకాదు తిరుమల వివాదంపై హిందుత్వాన్ని ఎత్తుకోవడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. టాప్ 5లో నిలిచారు.
6. శశాంక్ సింగ్.. పంజాబ్ కింగ్స్ లో క్రికెటర్ గా తనదైన శైలిలో రాణించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు గూగుల్ 2024 ట్రెండ్ లో 6వ ప్లేస్ లో నిలిచాడు.
7. పూనమ్ పాండే.. పూనమ్ పాండే తాను చనిపోయానంటూ పెద్ద డ్రామా ఆడి మరోసారి వార్తల్లో నిలిచి గూగుల్ 2024 ట్రెండ్ పర్సన్స్ లో 7వ స్థానంలో నిలిచింది.
8.రాధిక మర్చంట్.. అంబానీ ఇంటి చిన్న కోడలుగా అనంత్ అంబానీ భార్యగా రాధిక మర్చండ్ ఈ యేడాది గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన పర్సన్ గా 8వ స్థానంలో నిలిచారు.