Anti Aging Fruit Juice: వయస్సు పెరగడంతో చర్మం తన స్థితిస్థాపకతను కోల్పోవడం, ముడతలు పడటం, మచ్చలు ఏర్పడటం లాంటి మార్పులు సహజం. కానీ, ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన చర్మ సంరక్షణతో ఈ ప్రభావాలను నియంత్రించవచ్చు.
Anti Aging Fruit Juice: వయస్సు పెరగడంతో మన చర్మం కూడా మారుతుంది. దీని కారణంగా ముడతలు, మచ్చలు, వాతము వంటివి సహజంగా కనిపిస్తాయి. చాలా మంది మార్కెట్లో లభించే ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. కానీ కొన్ని మార్పులతో చర్మ సంరక్షణ చేయవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
సూర్యకాంతి నుంచి రక్షణ: సూర్యకాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని ముడతలు పడేలా చేస్తాయి. కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్ వాడాలి.
ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, గింజలు మరియు విత్తనాలు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చర్మానికి కావాల్సిన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.
నీరు ఎక్కువగా తాగడం: శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి రోజూ ఎక్కువ నీరు తాగాలి.
మంచి నిద్ర: నిద్ర సమయంలో చర్మం మరమ్మతు చేసుకుంటుంది. కాబట్టి రోజూ 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
డెర్మటాలజిస్ట్ ను సంప్రదించడం: చర్మ సమస్యలు ఉంటే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించడం చాలా ముఖ్యం.
రెగ్యులర్ మాయిశ్చరైజింగ్: చర్మాన్ని ఎల్లప్పుడూ మాయిశ్చరైజ్ చేయాలి.