మనం చాలా సినిమాల్లో గ్రహాంతరవాసులను చూసి ఉంటాము అవునా! కానీ నిజజీవితంలో గ్రహాంతర వాసిని చూసిన వారెవ్వరు లేరు. కానీ తూర్పు ఆఫ్రికాలోని రువాండా (South africa Rwanda) నుండి ఒక వార్త భయటకు వచ్చింది.
బజెనెజా లిబెర్టా (Bajeneza Liberata) అనే ఒక మహిళ వింతగా కనిపించే బిడ్డకు జన్మనిచ్చింది. చూడటానికి ఆ బిడ్డ గ్రహాంతరవాసిలా (Alien) ఉన్నందున అందరు అతడిని దెయ్యం (Ghost) లేదా ఏలియన్ అని పిలుస్తుంటారు. అసలు విషయం ఏమిటంటే.. జన్మనిచ్చిన తండ్రి కూడా ఆ బిడ్డను అంగీకరించకపోవటం...
డైలీ స్టార్ ప్రచురించిన కథనం ప్రకారం... బిడ్డ పుట్టిన వెంటనే చూసిన తండ్రి ఛీదరించుకోవటమే కాకుండా.. పసిగోడ్డును చంపమని చెప్పాడు. కానీ రువాండాకు చెందిన బజెనెజా లిబెర్టా (Bajeneza Liberata) అనే మహిళ దీనికి సమ్మతించలేదు. ఫలితంగా, ఆమె భర్త మరియు వారి కుటుంబ సభ్యులు ఆమెను, బిడ్డను దూరంగా ఉంచారు. భర్తతో కలిసి ఉండాలంటే ఆ ఏలియన్ బిడ్డను వదిలించుకొని రమ్మని ఆదేశించారు.
ఆ బిడ్డ తల్లి బజెనెజా ఆమె పడుతున్న బాధ ప్రపంచానికి తెలియాలని సోషల్ మీడియాలో (Social Media) తన గోడును వెల్లడించుకుంది. ఆమె భర్త మరియు కుటుంబ సభ్యులు వెలివేసిననందున ఒంటరిగా బిడ్డను చూసుకోటానికి ఇబ్బందిగా ఉందని కన్నీరు పర్యంతమైంది. (Photo:News Flash)
బజెనెజాకు ఇది మొదటి సంతానం కాదట.. ఇది వరకే పిల్లలు ఉన్నారట.. వారు సాధారణంగానే జన్మించి అందరిలానే ఉన్నారని.. ఈ ఒక్క బిడ్డ మాత్రమే ఇలా ఏలియన్ (Alien) లా పుట్టాడని.. భర్త, పిల్లలు మరియు కుంటుంబ సభ్యులు వదిలేయటం కారణంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నానని వాపోయింది. (Photo:News Flash)
బజనేజాను, పిల్లాడిని గ్రామస్తులందరు కలిసి బహిష్కరించారని.. ఊర్లోని మిగతా పిల్లలు గ్రహాంతరవాసి (Alen), దెయ్యం(Ghost) అని ఎగతాళి చేస్తున్నారని చెప్పింది. పిల్లాడికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో వైద్యులు కూడా తెలుపలేకపోయరట, కుమారుడు బాధతో అలమటిస్తున్నాడని, కొడుకు చికిత్స కోసం ప్రపంచం ముందుకు వచ్చానని.. దాతలు ఎవరైనా వారికి ఆన్ లైన్ లో సాయం చేయాల్సిందిగా బజెనెజా వేడుకుంది. (Photo:News Flash)