PF Account: ఒక్క పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు 7 లక్షల విలువైన ఈ సర్వీసులు అన్నీ ఫ్రీ.. వెంటనే త్వరపడండి

EPFO: ఉద్యోగం చేసేవారికి పీఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. పీఎఫ్ చందాదారులకు పదవీ విరమరణ తర్వాత పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు పీఎఫ్ అకౌంట్ ద్వారా పొందవచ్చన్న విషయం చాలా మందికి తెలియదు. మరి ఈ పీఎఫ్ చందాలకు లభించే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

1 /7

ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ కు ఉద్యోగి జీతంతోపాటు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం కూడా 12శాతం చొప్పున పీఎఫ్ అకౌంట్ కు ప్రతినెలా డబ్బులు జమ చేస్తుంది. ఈ మొత్తం కూడా ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత చేతికి వస్తుంది. అయితే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ డబ్బులను తీసుకునే వెసులుబాటు కూడా కల్పించింది కేంద్రం. అంతేకాదు పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈపీఎఫ్ అకౌంట్ ద్వారా లభించే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 /7

పీఎఫ్ ఖాతాలో జమ చేసే డబ్బులపై ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 80 సీ ద్వారా రూ. 150లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందే ఛాన్స్ ఉంటుంది. అయితే పాత పన్ను విధానం ఫాలో అవుతున్న వారికి మాత్రమే ఈ ట్యాక్స్ ప్రయోజనాలు లభిస్తాయి.

3 /7

ప్రతినెలా పీఎఫ్ అకౌంట్లో జమ చేసే డబ్బులపై వడ్డీ చెల్లిస్తుంది. ఇలా వచ్చే వడ్డీ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సి అవసరం ఉండదు. వడ్డీపై ట్యాక్స్ చెల్లింపులు కల్పిస్తోంది ఇన్ కమ్ ట్యాక్స్.   

4 /7

ఈపీఎఫ్ ఖాతాలో ఉండే డబ్బులపై ఏడాదికి ఒకేసారి 8.25శాతం ప్రకారం చక్రవడ్డీని అందిస్తుంది కేంద్రం. ఈపీఎఫ్ లో ఎక్కువ కాలం ఉండేవారికి పదవీ విరమణ నాటికి ఎక్కువ మొత్తంలోడబ్బు చేతికి అందుతుంది. 

5 /7

ఈపీఎఫ్ అందిస్తున్న మరో ప్రయోజనం ఇన్సూరెన్స్ సౌకర్యం. డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. సర్వీసులో ఉండగా పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగి మరణించినట్లయితే అతని ఫ్యామిలీకి రూ. 7లక్షల వరకు బీమా ప్రయోజనం ఉంటుంది.   

6 /7

ఈపీఎఫ్  అకౌంట్లో ఉన్న డబ్బులను ముందుగా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటి నిర్మాణం, వైద్య ఖర్చులు, ఉన్నత చదువులు పెళ్లి వంటి వాటికి ఇలా డబ్బులు వెనక్కు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.   

7 /7

ఈపీఎఫ్ చందాదారులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందుతుంది. ఒకవేళ చందాదారుడు మరణించినట్లయితే ఈ ఫ్యామిలీకి పెన్షన్ ఇస్తారు.