Jyothika Sisters: ముగ్గురు అక్కాచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక తెలుగు హీరో.. ఎవరంటే..?

Nagma Sisters: సాధారణంగా తల్లి కూతుర్లు లేదా తండ్రి కొడుకులు ఒక హీరో లేదా హీరోయిన్ తో కలిసి నటించడం సహజమే.. అయితే ఇక్కడ ఏకంగా ముగ్గురు అక్కచెల్లెళ్ళు కలిసి ఒకే హీరోతో నటించడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు. అయితే ఈ ముగ్గురు ఒకే హీరోతో కలిసి నటించి ఇండస్ట్రీకి దూరమైనా..  ఆ హీరో మాత్రం ఇప్పటికీ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1 /5

ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఓకే కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏకంగా ఒకే కుటుంబం  నుంచి ముగ్గురు హీరోయిన్స్ అక్కాచెల్లెళ్ళుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో కూడా నటించారు. ముఖ్యంగా తెలుగు, హిందీ , తమిళం భాషలలో కూడా నటించిన ఘనత అందుకున్నారు ఈ హీరోయిన్స్. 1990వ దశకంలో తెలుగు పరిశ్రమలో  ఒక వెలుగు వెలిగారు ఈ హీరోయిన్స్. మరి వారు ఎవరో కాదు అలనాటి హీరోయిన్స్ నగ్మా, జ్యోతిక, రోహిణి.

2 /5

అయితే ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక టాలీవుడ్ హీరో ఉన్నారు. ఆయనే టాలీవుడ్ హీరో చిరంజీవి.. నగ్మాతో చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంలో నటించారు.  ఈ చిత్రంలో వీరిద్దరి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక నగ్మా సోదరి జ్యోతిక విషయానికి వస్తే.. ఠాగూర్ సినిమాలో చిరంజీవికి జోడిగా జ్యోతిక నటించింది. ఆ తర్వాత రోహిణి విషయానికి వస్తే.. మాస్టారు చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇలా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించారు చిరంజీవి.   

3 /5

ప్రస్తుతం అయితే జ్యోతిక నటిగా,  నిర్మాతగా కూడా రాణిస్తోంది.. నగ్మా సినిమాలకు దూరమై పొలిటికల్ పరంగా బిజీగా ఉన్నది. ఇక హీరోయిన్ రోహిణి మాత్రం ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడ సినిమాలలో కనిపించడం లేదు. ఈ ముగ్గురితో కలిసి నటించిన మెగాస్టార్ మాత్రం ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

4 /5

చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.

5 /5

ఇక చిరంజీవి అందుకున్న పురస్కారాల విషయానికి వస్తే ఒకే ఏడాది మూడు పురస్కారాలు సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ యేడాది మొదట్లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి, ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నారు. అంతేకాదు అక్కినేని జాతీయ అవార్డుకు కూడా ఎంపికయ్యారు.