Electricity Charges Hike: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వ తొలి షాక్..! కరెంట్ ఛార్జీలు పెంపు

AP Govt Hike Current Bills: దీపావళికి ముందు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. విద్యుత్ ఛార్జీల పెంపునకు సిద్ధమైంది. యూనిట్‌కు రూ.1.21 పైసల చొప్పున  15 నెలల పాటు పెంపునకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. నవంబర్ నెల నుంచే ఛార్జీలు అమలులోకి రానున్నాయి. దీంతో ప్రజలపై మరింత భారం పడనుంది.
 

1 /5

ఏపీ ప్రజలకు కరెంట్ ఛార్జీల రూపంలో భారీ భారం పడనుంది. రూ.6,072.86 కోట్ల మేర వసూలు చేసేందుకు డిస్కంలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2 /5

రూ.8,114 కోట్లు డిస్కంలు ప్రతిపాదించగా.. రూ.2,042 కోట్లు తగ్గించి ఏపీఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది.  

3 /5

యూనిట్‌కు రూ.1.21 పైసల చొప్పున పెరగనుంది. నవంబర్ నుంచే యూనిట్‌పై భారం పడనుంది.  

4 /5

ప్రజల నుంచి డిసెంబర్ నెల నుంచి వసూలు చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కరెంట్ ఛార్జీల పెంపుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

5 /5

జగన్ సర్కారు హయాంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తొలి షాకిచ్చారు.