AP Elections: స్థానిక నాయకులకు చంద్రబాబు భారీ గుడ్‌న్యూస్‌.. ఎంత మంది పిల్లలు ఉన్నా 'సర్పంచ్‌'

No Limit Children AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక నాయకత్వానికి అదిరిపోయే వార్త. పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ప్రతిబంధకంగా ఉండగా తాజాగా తొలగిపోయింది. ఇకపై ఎంత మంది సంతానం ఉన్నా కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

1 /6

సంచలన నిర్ణయం: అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

2 /6

స్థానిక ఎన్నికలు: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ఇద్దరికి మించి పిల్లలు ఉన్న వారూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు కానున్నారు.

3 /6

ఇన్నాళ్లు నిరాశ: గతంలో ఇద్దరు కన్నా అధికంగా సంతానం ఉంటే పోటీకి అనర్హులు అనే విషయం తెలిసిందే. దీనివలన చాలామంది ఆర్థిక బలం.. జన బలం ఉన్న నాయకులు పోటీకి దూరమయ్యారు. ఇకపై వారంతా అర్హులు కానున్నారు. 

4 /6

నిబంధన సవరణ: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇకపై అర్హులే! దానికి సంబంధించిన నిబంధనకు సవరణ చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది.

5 /6

నాటి చట్టం: కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తిస్తూ చట్టం చేశారు.

6 /6

నిబంధన ఎత్తివేత: ప్రస్తుతం సంతానోత్పత్తి తగ్గడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.