Good News For Telangana Women: మహిళలు పండుగ చేసుకునే శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. ఉచితంగా చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో తెలంగాణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే చీరల పంపిణీ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రారంభించిన మొదటి పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోన్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో పథకాన్ని మహిళల కోసం పరిచయం చేయనుంది.
మహిళలకు పెద్దపీట వేస్తూ ఉచితంగా కరెంటు, రూ.500 గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తోంది. అతి త్వరలోనే మహలక్ష్మి పథకంలో భాగంగా రూ.2500 కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటుంది.
ఇదిలా ఉండగా మహిళలకు ఉచిత చీరలు పంపిణీ చేయాలనే అంశం తెరమీదకు వచ్చింది. మహిళా సంఘాలకు యూనిఫామ్ చీరలు పంపిణీ చేయడానికి రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది.
ఇప్పటికే ఈ చీరలను మంత్రి సీతక్క పరిశీలించారు. మహిళా సంఘాల కోసం తయారు చేస్తున్న చీరలను సెర్ప్ గురువారం సీతక్కకు చూయించారు. వీటి డిజైన్స్ అతి త్వరలోనే ఫైనల్ చేయనున్నారు.
ఉచితంగా ఈ యూనిఫామ్ చీరల పంపిణీ 62 లక్షలకు పైగా మహిళలకు అందించనున్నారు. దీంతో ఇది చరిత్రలోనే మొదటిసారి రేవంత్ సర్కార్ చేసినట్లువుతుంది.
మహిళా స్వయం సేవక సంఘాలకు వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇది మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. వారికి రేవంత్ సర్కార్ యూనిఫామ్ చీరలు పంపిణీ చేయడం హర్షణీయం.
అయితే, బతుకమ్మ చీరల పంపిణీ గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ, నాణ్యత బాగులేదని మహిళలు విమర్శలు సైతం గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదే బతుకమ్మ చీరలను ఇవ్వలేదని కొంతమంది మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు తాజాగా రేవంత్ సర్కార్ ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. మహిళా సంఘాలకు ఉచితంగా చీరలు అందించడానికి కసరత్తు చేస్తోంది. చీరల డిజైన్ ఫైనల్ అయిన వెంటనే మహిళకు ఉచితంగా చీరలు అందనున్నాయి.