Brahmamudi Today December 26th Episode: హలో ఆంటీ.. అంటూ స్వప్న నగలు వేసుకుని వస్తుంది. మరోవైపు ధాన్యలక్ష్మి, రుద్రాణీలు ఆకలి మంటతో ఉడికిపోతుంటారు. నాలో ఒక కొత్త చేంజ్ వచ్చింది అదేంటో చెప్పండి అంటుంది స్వప్న. ఇంతకీ నా మేడలో మెరిసిపోతుంది ఎలా ఉందో చెప్పనే లేదు అంటుంది స్వప్న.
ఏంటది అంటుంది రుద్రాణీ. వీటిని నెక్లెస్ అంటారు. చెవికమ్మలు కూడా ఉన్నాయి. ఏయ్.. ధాన్యలక్ష్మి అవి రోల్డ్‌గోల్డ్ అయి ఉంటాయి అంటుంది రుద్రాణీ. దీని కాస్ట్ రూ.10 లక్షలు ప్యూర్ 916 గోల్డ్ ఆంటీ అంటుంది. వృథా ఖర్చులు చేస్తున్నామని మమ్మల్ని పస్తులు ఉండేలా చేస్తుంది. నీకు మాత్రం ఖాళీ చెక్ ఇచ్చేస్తుందా? అని ధాన్యం మండిపడుతుంది. ఎంతైనా మా చెల్లికదా అక్క మెడ బోసిపోకూడదని కొనుక్కోమని ఇచ్చింది. ఎలా ఉన్నాయ్ ధాన్యలక్ష్మి ఆంటీ అంటుంది. దీంతో ఒక్కసారిగా ఊగిపోయిన ధాన్యం అక్క.. అంటూ కేకలు వేస్తుంది. పెరట్లో అపర్ణ, సుభాష్‌లు కాఫీ తాగుతుంటారు ఒక్కసారిగ్గా ఉలిక్కిపడతారు.
బావగారు మీరు కూడా వినాలి మాకు న్యాయం చేయాలి అంటుంది ధాన్యం. సరే చెప్పుఅంటాడు సుభాష్ అందరికీ సమన్యాయం అంటున్న కావ్య వాళ్ల అక్కకు గోల్డ్ నెక్లెస్ ఎలా కొంటుంది. ఆమెకో న్యాయం మాకోన్యాయమా? మీరు కూడా తెలిసి చేస్తున్నారా? అక్క. మాకు తెలిసింది కాబట్ట స్వప్నకు పది లక్షలు ఇచ్చింది కాబట్టి తెలిసింది. తెలియకుండా వారి కుటుంబానికి ఎంత పంపిస్తుందో అంటుంది రుద్రాణీ. స్వయాన స్వప్న చెప్పింది. ఈరోజు ఈ విషయం అటో ఇటో తెలిసిపోవాలి. అన్ని లెక్కలు తేలాలి. రాగానే కడిగి పడేస్తానుఅని చెప్పి వెళ్తారు రుద్రాణీ, ధాన్యంలు.
పని కూడా చేయకుండా వీళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారు. కావ్య కూడా అలాగే ఉంది. డబ్బులు లేవని చెప్పి స్వప్నకు ఎందుకు పదిలక్షలు ఇవ్వాలి.వచ్చాక అడుగుదాం అంటుంది అపర్ణ. అప్పుడే కావ్య రాజ్‌లు వస్తారు. హాల్ లో ఉన్న ధాన్యం వచ్చావా? మా కార్డ్స్ బ్లాక్ చేశావా? అంటుంది. ఎందుకు అంటే అనవసరమైన ఖర్చులు పెట్టకూడదని చేశా అంటుంది. మీ పుట్టింటి కి ఎంత డబ్బు ముట్టింది మీ అక్కకు మాత్రం గోల్డ్ నెక్లెస్ కొనివ్వచ్చా? అంటుంది ధాన్యం. మీ అక్కకు గోల్డ్ కొనివ్వడం అనవసరపు ఖర్చు కాదా అని నిలదీస్తుంది ధాన్యం.
దీంతో కావ్య అక్క.. అక్క.. అని స్వప్నకు కిందకు పిలుస్తుంది. కిందకు వచ్చి ఏంటి కావ్య ఏమైంది? అంటుంది స్వప్న. ఏంటి? గోల్డ్ నెక్లెస్ గురించి మా అత్త , మీ చిన్న అత్త పంచాయితీ పెట్టారా? అది వదిలేయ్ నా నెక్లెస్ ఎలా ఉంది చెప్పు అంటుంది స్వప్న. ఈ నెక్లెస్ ఎవరినీ అడిగి కొన్నావ్ అంటుంది. ఈ నెక్లెస్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటుంది కావ్య. నువ్వే కదా చెక్ ఇచ్చావ్ అంటుంది స్వప్న. ఇప్పుడేమంటావ్ టిఫిన్ పెట్టడానికి డబ్బులు లేవని గోల్డ్ కొనుక్కుంటున్నారు. అక్క నేను నీకు చెక్ ఇచ్చి గోల్డ్ నెక్లెస్ కొనుక్కోమని చెప్పానా? ఎవరినీ అడిగి ఇలా వాడుకున్నావ్ నేను చెప్పానా? అంటుంది కావ్య..అప్పుడే ఆహ... ఏం నాటకాలు ఆడుతున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా అబద్ధాలు ఆడుతున్నారు.
నీ మనవరాలు పదిలక్షు అక్కడ పెట్టొచ్చు కానీ, మాకు పది రకాల టిఫిన్లు పెడితే కరిగిపోతుందా అమ్మ అంటుంది రుద్రాణీ. అత్తయ్య, మావయ్య, అమ్మమ్మ ఇందుకే ఈ ముళ్ల కిరీటం నాకు వద్దని చెప్పా.. తాళ తెచ్చి అత్తయ్యంకు మాఆయనకు ఆస్తి పత్రాలు ఇస్తాననన్నాను. మీరంతా కలిసి నా చేతికి సంకేళ్లు వేశారు. ఇప్పుడునేను పుట్టింటికీ దోచి పెట్టేదాన్ని అయ్యాను అని కావ్య అంటుంది.
అబ్బబ్బా సుద్దపూస కళ్ల ముందే మీ అక్క చెక్ ఇచ్చిందని చెబుతుంది. మంచి దానిలా నటించకు అంటుంది రుద్రాణీ. ఆపండి తాళాలు నా చేతిలో ఉండటం మీకు ఎవరికీ నచ్చడం లేదు . అందుకే ఆ అవకాశం ఎప్పుడు దొరుకుతుంది అని చూశారు అంటుంది. ఈ విషయంలో వాళ్లు ప్రశ్నించడం న్యాయమే కదామ్మ. మీ అక్కకు ఎందుకు ఇచ్చావ్ అంటాడు సుభాష్.
ఎవరికి సమాధానం చెప్పాలి డ్యాడి. నా భార్య ఎందుకు సమాధానం చెప్పాలి. స్వప్న కళావతి నీకు చెక్ ఇచ్చినప్పుడు నీకు నెక్లెస్ కొనమని ఇచ్చిందా? ఇంట్లో ఏమైనా అవసరం ఉంటే ఖర్చు పెట్టమని ఇచ్చింది చెప్పు. ఇంట్లో ఎవరికైనా అవసరమైతే ఇవ్వమని ఇచ్చింది. కానీ, ఎవరికీ ఏ అవసరం రాలేదు అందుకే ఈ నెక్లెస్ కొన్నా అంటుంది స్వప్న. ఇప్పుడు అర్థమయిందా? మీరు నాభార్యను అడిగినదానికి సమాధానం ఇప్పుడు దొరికిందా? డాడి అంటాడు. అక్క ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదా? తాతయ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు నువ్వు ఈ పనిచేయడం మంచి పనేనా? పెద్దదానివి అయ్యావు నీకు ఉన్న నగలు సరిపోవా? చూడు ఏమైనా కావాలి అంటే నీ భర్తను అడుగు అంతే కానీ అడగకుండా దుగ్గిరాల వారి డబ్బులను ఖర్చు పెట్టడం మంచి ది కాదు.
చాలు ఆపు.. అసలు నాకు ఈ నెక్లెస్ వద్దు ఇది అమ్మేసుకుని ఆ పదిలక్షలు తీసుకో..అని ఏడ్చి నగ అప్పజెప్పివెళ్లిపోతుంది. ఇదంతా పెద్ద నాటకం అంటుంది ధాన్యం. రాజ్ ముందు అమాయకంగా నటిస్తూ నెక్లెస్ కొనుక్కోమని చెప్పింది అంటుంది ధాన్యం. మీరు ఇక మారరా? అంటుంది అపర్ణ. నేను ఇంతే ఇక నుంచి నేను ఇంతే. ఇప్పుడు నా నిర్ధిషిత్వాన్ని మా ఆయన రుజువు చేశాడు కానీ, ఇక నుంచి నేను దేనికి సమాధానం చెప్పా. లక్షలకు లక్షలు దుబారా చేసే రోజులు పోయాయి. ఆకాశంలో విహరించడం ఆపి నేల మీద నడవడం మొదలు పెట్టండి అంటుంది కావ్య.