Monalisa Movie: అల్లు అర్జున్ తో కుంభమేళా బ్యూటీ మోనాలిసా సినిమా ఖరారు.. పోస్టర్ తో సహా..!

Monalisa with Allu Arjun: మహా కుంభమేళాలో వైరల్ గా మారిన మోనాలిసాకి సినిమాలో అవకాశం వచ్చినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అయితే ఈ పోస్టులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అల్లు అర్జున్ పుష్ప పోస్టర్ ముందర నిలబడుకొని ఈ హీరోయిన్ షేర్ చేసిన పోస్ట్.. అందుకు ఆమె పెట్టిన క్యాప్షన్.. అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

1 /5

ప్రయాగ్ రాజ్ లో దాదాపు 144 సంవత్సరాల తర్వాత కోట్లాదిమంది భక్తులతో దాదాపు 45 రోజులపాటు అత్యంత ఘనంగా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచంలో నలుమూలల ఉండే భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరించి పాపాలు పోగొట్టుకుంటున్నారని చెప్పవచ్చు. 

2 /5

ఇదిలా ఉండగా.. ఈ మహా కుంభమేళాలో తేనె కళ్ళ సుందరిగా తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది పూసలమ్మే అమ్మాయి అలియాస్ మోనాలిసా. కొంతమంది ఈమె ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయిన మోనాలిసా.. ఆ తర్వాత యూట్యూబ్లో ట్రెండ్ అయిపోయింది. దీంతో మహా కుంభమేళా వైరల్ బ్యూటీ అని పేరు కూడా దక్కించుకుంది. 

3 /5

కుంభమేళాలో ఈమెను చూసిన చాలామంది ఈమెతో ఫోటోలు దిగడానికి ఎంతో ప్రయత్నం చేశారు. దాంతో తన వ్యాపారానికి ఇబ్బంది కలిగిందని భావించిన మోనాలిసా తన కుటుంబంతో సహా తన సొంత ఊరికి వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా ఈమె అందం చూసి పడిపోయిన డైరెక్టర్స్ ఈమెకు సినిమాలలో అవకాశాలు ఇస్తామని తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే బాలీవుడ్ డైరెక్టర్ నేరుగా ఈమె ఇంటికి వెళ్లి మరి సినిమాలో ఆమెతో అగ్రిమెంట్ పై సైన్ చేయించుకున్నారు. 

4 /5

ఇప్పుడు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మోనాలిసా కూడా ప్రకటించింది. తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 పోస్టర్ పక్కన నిలబడి థియేటర్ బయట ఫోటో దిగి ఈ ఫోటోని షేర్ చేస్తూ ఇప్పుడు ఈ పోస్టర్ బయట నిలబడ్డాను త్వరలోనే పోస్టర్లో కనిపిస్తాను అంటూ తెలిపింది . అంతేకాదు ఇది ఒక కాలచక్రం లాంటిది అని.. ఈ మేరకు తన సినీ ప్రయాణం మీద ఆసక్తికర ట్వీట్ చేసిన మోనాలిసా.

5 /5

ఈరోజు పోస్టర్ బయట, రేపు పోస్టర్ లోపల, ఇది కాలచక్రం, త్వరలో ముంబైలో కలుద్దాం.. అంటూ మోనాలిసా పోస్ట్ పెట్టడంతో ఇక ఈమె సినిమాల్లో నటించబోయేది నిజమే అని అందరూ కామెంట్లు చేస్తున్నారు