Bathukamma 2024: ఆరవ రోజు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?

Bathukamma 6 Th Day Speciality: బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగా వైభవంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 7వ తేదీ సోమవారం ఆరవ రోజు 'అలిగిన బతుకమ్మ' అని పిలుస్తారు. దీనికి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
 

1 /5

Bathukamma 6 Th Day Speciality: పూల జాతర వచ్చింది. ఊరూవాడా శోభాయమానంగా చుట్టాలుపక్కాలు అంతా కలిసి కన్నులపండువగా తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. మహిళలందరూ ముస్తాబై అందరూ ఒక్క చోట చేరి బతుకమ్మను ఆడతారు.  

2 /5

భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది ప్రతి ఏడాది బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. తొమ్మిది రోజులపాటు ప్రసాదాలు పెడతారు. ఒక్కోరోజూ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.  

3 /5

ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ముఖ్యంగా బతుకమ్మలో గౌరమ్మను కూడా తయారు చేస్తారు. ఒకరికి ఒకరు వాయినాలు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు.  

4 /5

మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలో పాల్గొంటారు. మనదేశమే కాదు విదేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు కూడా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. అయితే, అక్టోబర్‌ 7వ తేదీ అలిగిన బతుకమ్మగా పిలుస్తారు.  

5 /5

ఈ బతుకమ్మకు ఈ పేరు ఎలా వచ్చిందంటే పురాతన కథల ప్రకారం ఈరోజు బతుకమ్మను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలింది దీంతో ఆరోజు బతుకమ్మను ఆడరు. ఎలాంటి ప్రసాదం కూడా తయారు చేయరు. ఆరో రోజును అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)