Ram mandir Beautiful Pics: రంగు రంగుల పూలు, విద్యుత్ దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా సుందరంగా రామమందిరం ఫోటోలు

అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడిప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఓ పండుగలా జరగనుంది. అటు రామమందిరం..ఇటు అయోద్య పట్టణం సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఆలయం రంగు రంగుల పూవులతో అలంకృతమౌతోంది. ఆ ఫోటోలు మీ కోసం..

Ram mandir Beautiful Pics: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడిప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఓ పండుగలా జరగనుంది. అటు రామమందిరం..ఇటు అయోద్య పట్టణం సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఆలయం రంగు రంగుల పూవులతో అలంకృతమౌతోంది. ఆ ఫోటోలు మీ కోసం..
 

1 /6

రామమందిరం పూలతో అలంకరించుకుంటూ అత్యంత సుందరంగా కన్పిస్తోంది. 

2 /6

జనవరి 19న రామ్‌లల్లా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. జనవరి 22వ తేదీన జరిగే ప్రాణ ప్రతిష్ఠను ఆకర్షణీయంగా మార్చేందుకు మొత్తం ప్రాంగణాన్ని పూలతో నింపుతున్నారు.

3 /6

పూల అలంకరణతో పాటు రామమందిరంలో ఇతర ప్రదర్శనలు కూడా ఏర్పాటవుతున్నాయి. ప్రాణ ప్రతిష్టం కంటే ముందే లేజర్ షో అందర్నీ అలరించింది. 

4 /6

రామమందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకుని దేశం నలుమూలల్నించి భక్తులు, ప్రముఖులు తరలివస్తున్నారు. ఆలయం ప్రధాన ద్వారం నుంచి లోపలి వరకూ మొత్తం పూలతో అలంకరించారు. అయోధ్య నగరంలో దీపావళి పండుగ వాతావరణం నెలకొంది.

5 /6

రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహాల ప్రాణ ప్రతిష్ట జనవరి 22వ తేదీ మద్యాహ్న 12.20 నిమిషాలకు ప్రారంభం కానుంది. రామమందిరంలో ఐదురోజుల అనుష్టానం జనవరి 16న ప్రారభమైంది. ప్రస్తుతం ఆలయంలో యజ్ఞం, యాగాలు నడుస్తున్నాయి. 

6 /6

జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. దీనికోసం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలోని హిందూవులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆలయమంతా పూవులతో నిండిపోతోంది. రామమందిరం సౌందర్యం రెండు కళ్లు చూడలేకున్నాయి.