Tripti Dimri: చీరకట్టలో సాంప్రదాయంగా కనిపించిన బోల్డ్ బ్యూటీ..!

Tripti Dimri Viral Photos: ఒక్క సినిమాతోనే తెగ ఫేమస్ అయిపోయింది త్రిప్తి డిమ్రి. అప్పటివరకు హిందీ వారికి మాత్రమే తెలిసిన ఈ హీరోయిన్.. యానిమల్ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గర అయింది. తాజాగా ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు కొన్ని ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. 

1 /6

యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ సెలబ్రిటీ అయిపోయిన బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దాదాపు 8 సంవత్సరాలకు పైగా సక్సెస్ కోసం ఎదురుచూసిన ఈ ముద్దుగుమ్మకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మంచి విజయాన్ని అందించారు.   

2 /6

ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలు,  వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈమె తాజాగా చీర కట్టులో సాంప్రదాయంగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. 

3 /6

ఎంబ్రాయిడరీ తో ప్రత్యేకంగా తయారు చేసిన ఆరెంజ్ కలర్ నెట్టెడ్ సారీ ధరించి, అందుకు భిన్నంగా ఎంబ్రాయిడరీ తో చాలా అద్భుతంగా డిజైన్ చేసిన మెరూన్ కలర్ బ్లౌజ్ ధరించి సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా అనిపించింది. 

4 /6

హెయిర్ లీవ్ చేసి గాలికి ఎగురుతున్న కురుల మధ్య తన అందాలతో మరొకసారి అలరించింది. కాటుక కళ్ళతో కవ్వించింది. ఎప్పుడు బోల్డ్ ఫోటోషూట్ చేసి అభిమానులకు బోర్ కొట్టించిన ఈమె తాజాగా చీరకట్టు లో  కనిపించి మెస్మరైజ్ చేసింది. 

5 /6

త్రిప్తి డిమ్రి షేర్ చేసిన ఫోటోలకి అభిమానులే కాదు నెటిజెన్లు కూడా ఫిదా అవుతూ పలు రకాల ఎమోజీలు షేర్ చేస్తూ ఆమెపై ఉన్న ప్రేమను కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు.

6 /6

ప్రస్తుతం త్రిప్తి డిమ్రి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అమ్మడు అందానికి ఫిదా అవుతున్నామంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా దసరా పండుగ సందర్భంగా సాంప్రదాయంగా కనిపించి అందరిని ఆకట్టుకుంది.