వేసవి సమీపిస్తోంది. వేసవి సెలవుల్లో వెకేషన్ ఎక్కడికని ప్లాన్ చేస్తుంటే అండమాన్ నికోబార్ దీవులు మంచి ఆప్షన్ కావచ్చు. ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజ్ అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌లో వసతి, భోజనం, గైడ్, ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఐఆర్సీటీసీ అందిస్తున్న అండమాన్ నికోబార్ ప్యాకేజ్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Andaman nikobar Tour package: వేసవి సమీపిస్తోంది. వేసవి సెలవుల్లో వెకేషన్ ఎక్కడికని ప్లాన్ చేస్తుంటే అండమాన్ నికోబార్ దీవులు మంచి ఆప్షన్ కావచ్చు. ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజ్ అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌లో వసతి, భోజనం, గైడ్, ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఐఆర్సీటీసీ అందిస్తున్న అండమాన్ నికోబార్ ప్యాకేజ్ ఎలా ఉందో తెలుసుకుందాం.
ఐఆర్సీటీసీ పర్యాటకులకోసం అండమాన్ టూర్ ప్యాకేజ్ ఇది. ఈ ప్యాకేజ్ 6 రాత్రులు, 7 రోజులుంటుంది.
ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజ్ పేరు Exotic Andaman Ex Ahmedabad. ఈ ప్యాకేజ్‌లో పర్యాటకులు పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్, నీల్ ఐలాండ్స్ పర్యటిస్తారు. టూరిస్ట్ ఫ్లైట్ ద్వారా ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజ్‌లో 3 రాత్రులు పోర్ట్ బ్లెయిర్, 1 రాత్రి నీల్ ఐలాండ్‌లోనూ 2 రాత్రులు హేవ్‌లాక్ ఐలాండ్‌లోనూ బస చేస్తారు.
ఐఆర్‌సీటీ టూర్ ప్యాకేజ్ వేర్వేరుగా ఉంటుంది. మీరు ఒక్కరే ప్రయాణిస్తుంటే ఒక్కొక్కరికి 77,900 రూపాయలౌతుంది. ఇద్దరు కలిసి అయితే ఒక్కొక్కరికి 57,900 రూపాయలౌతుంది.
ముగ్గురితో కలిపి టూర్ ప్లాన్ చేస్తే ఒక్కొక్కరికి 56000 రూపాయలౌతుంది. ఇందులో 5-11 ఏళ్ల పిల్లకు బెడ్‌తో పాటు అయితే 47,600 అవుతుంది.
బెడ్ లేకుండా 5-11 ఏళ్ల పిల్లలకు 43,500 రూపాయలు అవుతుంది. అదే 2-4 ఏళ్ల పిల్లలకైతే 28000 అవుతుంది. ఈ ప్యాకేజ్ పూర్తి వివరాలు ఐఆర్సీటీసీ వెబ్సైట్0లో ఉంది .