Varun Tej Donning The Sacred Hanuman Mala In Kondagattu Temple: వివాహం అనంతరం నటించిన తొలి సినిమా మట్కా ఘోర పరాభవంతో మెగా నటుడు వరుణ్ తేజ్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. భారీ ఓటమి నుంచి కోలుకున్న వరుణ్ తెలంగాణలోని ప్రసిద్ధి కొండగట్టు ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా హనుమాన్ మాల వేసుకున్నాడు.
భారీ ఫ్లాప్: పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'మట్కా' సినిమా ఇటీవల విడుదలై ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.
కోలుకోలేని దెబ్బ: ఆ సినిమా పరాభవం నుంచి కోలుకున్న వరుణ్ తేజ్ ఆధ్యాత్మిక బాట పట్టినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట ఏపీలోని కొన్ని ఆలయాలను సందర్శించాడు.
ఆధ్యాత్మిక బాట: తాజాగా తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశాడు.
కొండగట్టు దర్శనం: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆలయానికి రావడమే కాకుండా వరుణ్ తేజ్ హనుమాన్ మాల ధరించడం చర్చనీయాంశంగా మారింది.
మాలధారణ: మాల దుస్తుల్లో ఉన్న వరుణ్ తేజ్‌కు ఆలయ అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలికి దర్శనం చేయించారు. అనంతరం వేదాశీర్వచనం అందించి దీవించారు.
మా ఇంటి ఇలవేల్పు: దర్శనం అనంతరం వరుణ్ తేజ్ మాట్లాడుతూ 'మా మెగా ఇంటి ఇలవేల్పు కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉంది. కొండగట్ట మహిమగల దేవుడు. తొలిసారి కొండగట్టుకు వచ్చా. మొదటిసారి హనుమాన్ దీక్ష తీసుకున్నా' అని తెలిపాడు.