Priya Bhavani Shankar: ఫెమస్ కోసం ఆ పనిమాత్రం చేయలేను.. బాంబు పేల్చిన కళ్యాణం కమనీయం భామ..

Priya Bhavani Shankar: కళ్యాణం కమనీయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి ప్రియా భవానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
 

1 /7

చాలా మంది సినిమా రంగంఅంటేనే గ్లామర్ గా ఉండాలని భావిస్తారు. అదే విధంగా అక్కడ క్విడ్ ప్రో కో ఉంటుందని, మంచి చాన్స్ లు రావాలంటే.. దేనీకైన రెడీగా ఉండాలని తరచుగా వార్తలు విన్పిస్తు ఉంటాయి.

2 /7

ఇటీవల అనేక ఘటనల్లో హీరోయిన్లు మీటూ వేధింపులకు గురైన ఘటనలు తరచుగా వార్తలో ఉంటున్నాయి. కొంత మంది తారలు.. ఫెమస్ అవ్వడం కోసం.. గ్లామర్ డోస్ లు పెంచుతూ పోతున్నారు. కానీ మరికొందరు మాత్రం.. దీనికి పూర్తిగా అపోసిట్ గా ఉంటున్నారు. 

3 /7

ఈ నేపథ్యంలో .. తాజాగా, నటి ప్రియా భవానీ శంకర్ ఆ గ్లామర్ డోస్ లపై చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.టాలెంట్ ఉంటే ఏ రంగంలోనైన రాణిస్తారని గ్లామర్ షో అవసరంలేదని నటి చెప్పుకొచ్చారు.

4 /7

నటి ప్రియా భవానీ శంకర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. .తన మూవీ బ్లాక్ గురించి మాట్లాడారు.  గ్లామరస్ పాత్రలంటే..తనకు అంతగా ఇష్టంలేదన్నారు. అదే విధంగా ఫ్యాషన్ పేరుతో కొంత మంది అతిగా ఎక్స్ పోజ్ లు చేస్తుంటారని మండిపడ్డారు.

5 /7

నా వరకు మాత్రం.. శరీరాన్ని ఒక వస్తువుగా భావించనన్నారు. ఆడియన్స్ కోసం..  గ్లామర్ ను చాపల పర్చలేనని వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా నెగేటివ్ రోల్స్ చేసేందుకు ఇష్టపడన్నారు.

6 /7

కొంత మంది ఫెమ్ అవ్వాలంటే.. గ్లామర్ ను షార్ట్ కట్ గా భావిస్తున్నారని, అది నిజంకాదని నటి ప్రియా భవానీ శంకర్ అన్నారు.  మరోవైపు బ్లాక్ మూవీ ..జీవా హీరోగా నటించారు. ఈ మూవీకి బాలసుబ్రమణి దర్శకత్వం వహించారన్నారు.  

7 /7

అదే విధంగా ఈ సినిమా పూర్తిగా హారర్ జానర్ లో తెరకెక్కిందన్నారు. అక్టోబరు 11న అంటే.. దసరాకు ఒక రోజు ముందు ఆడియన్స్ ముందుకు వస్తుందన్నారు నటి ప్రియాభవానీ శంకర్..