ABZO VS01 Electric Cruiser Bike: మార్కెట్‌లోకి అద్భుతమైన ABZO VS01 ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే దీనికి సంబంధించిన ధరను కూడా కంపెనీ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ABZO VS01 Electric Cruiser Bike: మార్కెట్‌లో క్రూయిజర్ బైక్స్‌కి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే.. ప్రీమియం ఫీచర్స్, అతి శక్తివంతమైన ఇంజన్ కలిగిన ఈ బైక్స్ అద్భుతమైన డిజైన్స్‌ను కలిగి ఉంటాయి. గతంలో భారత మార్కెట్‌లో ఇలాంటి బైక్‌లు అస్సలు ఉండేవి కావు.. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ మోటర్‌సైకిల్ ABZO కంపెనీ అద్భుతమైన క్రూయిజర్ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ ABZO VS01 క్రూయిజర్ బైక్ ఎలక్ట్రిక్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల చేసింది. ఈ మోటర్‌సైకిల్ అద్భుతమైన లుక్‌ను కలిగి ఉంటుంది.
ఇక ఈ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటర్‌సైకిల్ వివరాల్లోకి వెళితే.. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 180 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. అలాగే కంపెనీ దీని ధరను కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇది రూ.1.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల కానుంది.
ఇక ఈ ABZO VS01 ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ అద్భుతమైన డిజిటల్ స్పీడోమీటర్‌తో విడుదల కానుంది. ఇందులో కంపెనీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ , ఓడోమీటర్‌తో పాటు ప్రత్యేకమైన ట్రిప్ మీటర్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన ఆధునిక LED హెడ్‌లైట్‌ను కూడా అందిస్తోంది.
ఈ మోటర్‌సైకిల్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో పాటు కాన్ఫిడెంట్ బ్రేకింగ్ సెటప్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ట్యూబ్‌లెస్ టైర్లను కూడా అందిస్తోంది.
ఇక ఈ బైక్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఇందులో 5.04 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా స్పెషల్ ఛార్జింగ్ కిట్‌ను కూడా అందిస్తోంది. ఈ బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 6 గంటల పాటు సమయం కూడా పడుతుంది. అయితే త్వరలోనే ఈ బైక్‌కి సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించనుంది.