Gold Rate Today: బంగారం ధర తగ్గిందోచ్‌...కొత్త ఏడాదిలో మొదటిసారి రూ. 4900 తగ్గిన గోల్డ్ రేట్

Gold Rate Today: కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు.. తొలిసారిగా ఈరోజు జనవరి 4వ తేదీ శనివారం తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజున బంగారం ధర 10 గ్రాములకు గరిష్టంగా 870 రూపాయలు పెరిగింది. జనవరి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు 1640 రూపాయలు పెరిగింది. దీంతో తులం బంగారం ధర 80 వేలకు చేరువైంది. ఈ క్రమంలో నేడు శనివారం బంగారం ధరలు దిగిరావడంతో కొనుగోలుదారుల్లో ఊరట కలిగింది .
 

1 /9

Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త. నేడు జనవరి 4వ తేదీ శనివారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత మూడు రోజులుగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలు నేడు శనివారం  భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియుల్లో ఆనందం  నెలకొంది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్లో ధరలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్  హెచ్చుతగ్గుదల, వడ్డీరేట్లు, నగల మార్కెట్లో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేడు బంగారం ధరలు ఏ ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  

2 /9

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు,  నగరాల్లో ఈరోజు 10 గ్రాముల బంగారం ధర 450 రూపాయలు  తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 490 రూపాయలు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 72,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 78,710కు దిగివచ్చింది.

3 /9

దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం.. ధర 7860 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 72,300 దగ్గర ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా 450 రూపాయలు 490 రూపాయలు  తగ్గుదల నమోదు చేశాయి.

4 /9

ఇక వెండి ధరలకు వస్తే 2025వ సంవత్సరంలో వెండి ధరలు కూడా నేడు తొలిసారిగా  తగ్గుదల నమోదు చేశాయి. కొత్త ఏడాది ప్రారంభం నుంచి నిలకడగా ఉన్న వెండి ధరలు.. క్రితం రోజున ఏకంగా 2000 రూపాయలు పెరిగింది. దీంతో నిరాశ చెందిన కొనుగోలుదారులకు  నీటి ధరలు కాస్త ఊరట కలిగించాయి.  

5 /9

హైదరాబాద్ చెన్నై విజయవాడ బెంగళూరు ముంబై ప్రాంతాల్లో కిలో వెండి ధర వెయ్యి రూపాయల చొప్పున తగ్గి 99 వేల రూపాయలకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో కూడా 1000 రూపాయలు తగ్గిన వెండి ధర 91 500 వద్ద ఉంది .

6 /9

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య బంగారానికి సురక్షితమైన స్వర్గధామం డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధరలు ఇటీవల పెరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను పెద్ద విధాన మార్పులు చేయవచ్చు. దీంతో మార్కెట్‌లో ఆందోళనలు పెరిగాయి. 

7 /9

ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత వాణిజ్య యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఆందోళనలన్నీ బంగారం ధరలను బలపరుస్తున్నాయి. తాజా భౌగోళిక రాజకీయ ఆందోళనల గురించి మాట్లాడుతూ, రష్యా బుధవారం ఉదయం కీవ్‌పై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో రెండు జిల్లాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో, ఇజ్రాయెల్ సైన్యం గాజా నగర శివారు ప్రాంతంపై దాడి చేసింది. 

8 /9

అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు అనిశ్చితులు, రిజర్వ్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీకి వ్యతిరేకంగా తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి. ధరలను పెంచుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, 2024 మొదటి 10 నెలల్లో సెంట్రల్ బ్యాంకులు దాదాపు 740 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. అయితే డాలర్ బలం కారణంగా బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది. డాలర్ ఇండెక్స్ వరుసగా ఆరో వారం పెరిగింది. డాలర్ ప్రస్తుతం రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఇతర కరెన్సీలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేయడం ఖరీదైంది.

9 /9

నిపుణుల అభిప్రాయం ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ హయాంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, ఆర్థిక అనిశ్చితి పెరగవచ్చు. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ట్రంప్ హయాంలో వాణిజ్య యుద్ధాలు, సంభావ్య సంఘర్షణలు, అనూహ్య విధానాలు పెట్టుబడిదారులను సురక్షితమైన స్వర్గంగా బంగారం వైపు ఆకర్షిస్తాయి.