8th Pay Commission Gratuity: ఉద్యోగులకు జాక్‌పాట్, 8వ వేతన సంఘంతో గ్రాట్యుటీ, జీతం ఎన్ని రెట్లు పెరుగుతుందో తెలుసా

8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా ఆనందంగా ఉన్నారు. 8వ వేతన సంఘంతో కేవలం జీతాలు మాత్రమే కాకుండా డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ, గ్రాట్యుటీ కూడా భారీగా పెరగనుంది. ఎంత పెరుగుతాయి, ఏ మేరకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం.

8th Pay Commission Gratuity in Telugu: 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా ఆనందంగా ఉన్నారు. 8వ వేతన సంఘంతో కేవలం జీతాలు మాత్రమే కాకుండా డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ, గ్రాట్యుటీ కూడా భారీగా పెరగనుంది. ఎంత పెరుగుతాయి, ఏ మేరకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం.
 

1 /6

8వ వేతన సంఘంతో జీతభత్యాలే కాకుండా గ్రాట్యుటీ కూడా గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం గ్రాట్యుటీ పరిమితి 20 లక్షలు కాగా 8వ వేతన సంఘంతో 25 నుంచి 30 లక్షలు కానుంది. ఎందుకంటే గ్రాట్యుటీ అనేది కనీస వేతనం, డీఏను బట్టి నిర్ణయిస్తారు. ఓ ఉద్యోగి 18 వేల కనీస వేతనంతో 30 ఏళ్లు పనిచేస్తే అతనికొచ్చే గ్రాట్యుటీ 4.89 లక్షలు. అయితే కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 2.86 శాతానికి పెరిగితే గ్రాట్యుటీ 12.56 లక్షలు అవుతుంది.

2 /6

8వ వేతన సంఘం ఏర్పాటులో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రభావం చాలా ఎక్కువ. 7వ వేతన సంఘంలో ఫిట్‌ మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం ఉంది. దాంతో కనీస వేతనం 18 వేల నుంచి 46,620 వరకూ పెరిగింది. కొత్త వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే కనీస వేతనం 18 వేలకు పెరుగుతుంది. 

3 /6

8వ వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 25 శాతం నుంచి 35 శాతం పెరగనున్నాయి. ఇక డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ కూడా పెరుగుతాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 30 శాతం పెరుగుతాయి.

4 /6

ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ, పెన్షన్ కూడా పెరకబోతోంది. ఈ నిర్ణయంతో ఏకంగా 49 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. 

5 /6

8వ వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 25 నుంచి 35 శాతం పెరగనున్నాయి. అంతేకాకుండా  డియర్‌ నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, ట్రావెల్ అలవెన్సులతో పాటు గ్రాట్యుటీ కూడా పెరగనుంది. 

6 /6

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్లు పెంచేందుకు తగిన సిఫార్సుల చేస్తుంటుంది వేతన సంఘం. ప్రస్తుత ఉన్న 7వ వేతన సంఘం 2026 డిసెంబర్ నెలలో పూర్తవుతుంది. అందుకే కొత్త వేతన సంఘం ఏర్పాటు అవసరమైంది.