Revanth Reddy Record: కేసీఆర్‌ రికార్డును తిరగరాసిన రేవంత్‌ రెడ్డి! ఏ రికార్డు తెలుసా?

Revanth Reddy Rewrites KCRs Record In Debts: ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో రాష్ట్ర అప్పులు. అప్పుల విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌నే రేవంత్‌ రెడ్డి మించిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. కేసీఆర్‌ కన్నా అధిక అప్పులు రేవంత్‌ చేసినట్లు తేలింది.

1 /8

కొత్త రికార్డు: అప్పుల విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌నే రేవంత్‌ రెడ్డి మించిపోయాడని లెక్కలు చెబుతున్నాయి. కేసీఆర్‌ కన్నా అప్పుల రికార్డుల్లో రేవంత్‌ కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు.

2 /8

పార్టీల మధ్య యుద్ధం: తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అప్పులపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది.

3 /8

కేసీఆర్‌ను మించి: అప్పుల్లో గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మించి రేవంత్‌ రెడ్డి చేస్తున్నాడని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

4 /8

ఏడాదిలోనే: ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే చేసిన అప్పు అక్షరాల రూ.1,24,208.84 కోట్లు

5 /8

అప్పుల వివరాలు: అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభుత్వం చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు రూ.52,118 కోట్లు. నాన్ ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు రూ.61,991.14 కోట్లు, పబ్లిక్ సెక్టార్ల మీద తీసుకున్న రుణాలు రూ.10,099.70 కోట్లు.

6 /8

నాడు ఏడాదికి.. నేడు నెలకు: అన్ని రుణాలు కలిపితే సంవత్సరంలో రేవంత్‌ రెడ్డి చేసిన మొత్తం అప్పు రూ.1,24,208.84 కోట్లు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏడాదిలో పాతిక వేల కోట్లు అలా అప్పులు చేయగా.. రేవంత్‌ రెడ్డి నెలకు రూ.15 వేల కోట్ల నుంచి పాతిక వేల కోట్ల అప్పులు చేస్తున్నాడని గణాంకాలు చెబుతున్నాయి.

7 /8

లక్ష పాతికవేల కోట్లు: కేసీఆర్‌ పదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.ఐదు లక్షలు కూడా దాటలేదు. కానీ కేవలం ఏడాది పాలనలోనే రేవంత్‌ రెడ్డి దాదాపు లక్ష పాతికవేల కోట్ల అప్పులు చేయడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌ రెడ్డి తెలంగాణను మరింత అప్పులపాలు చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.

8 /8

ప్రజలను తప్పుదోవ: అప్పులపై అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులు తిప్పికొట్టారు. అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు సభలో చెప్పిన విషయాలు ఇంకా జనాల్లో చర్చ జరుగుతోంది.