Ancient City: ముస్లిం దేశాల నేల నుంచి ప్రపంచం ఉలిక్కిపడే వాస్తవం వెలుగుచూసింది. ఏకంగా 4 వేల ఏళ్ల నాటి ప్రాచీన పట్టణం బయటపడింది. ఈ పట్టణంలో లభించిన మట్టి గిన్నెలు, ప్రాచీన ఆయుధాలు ఇందుకు కారణం. ఈ ప్రాచీన పట్టణం విశేషాల గురించి తెలుసుకుందాం.
మెసపటోమియా, మిశ్ర్లో పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందేవి. అల్ నతాహ్ ప్రత్యేకంగా పరివర్తనం చెందింది. ఈ అభివృద్ధి నెమ్మది నెమ్మదిగా జరిగింది.
రాళ్లు-ఆయుధాల వంటి వస్తువులు స్మశానంలోని సమాధుల్లో అగెట్ రాళ్లు, ఆయుధాలు చాలా ప్రాచీనమైనవి. అల్ నతాహ్ అణ్వేషణతో అరేబియా పట్టణీకరణ బయటపడింది.
పలు కళాకృతులు లభ్యం ఈ పట్టణంలో తవ్వకాలు జరిపినప్పుడు వివిధ రకాల కళాకృతులు బయటపడ్డాయి. ఇందులో మట్టి గిన్నెలు, పలు ఆయుధాలు ఈ పట్టణం ప్రాచీనతకు అద్దం పడుతున్నాయి. ఈ కళాకృతులు చాలా అందంగా ఉన్నాయి.
పట్టణం లే అవుట్ అల్ నతాహ్ పట్టణం దాదాపుగా 2.6 హెక్టార్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఈ పట్టణం లే అవుట్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. పట్టణవాసుల ప్రణాళికా బద్ధమైన జీవన విధానం, పటిష్టమైన పునాది వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ ఇలా అన్నీ ఓ క్రమపద్ధతిలో ఉన్నాయి.
ఈ పట్టణంలో 500 మంది నివాసం ఈ పట్టణం దాదాపుగా క్రీస్తు పూర్వం 2400 సంవత్సరానిదిగా తెలుస్తోంది. దాదాపు క్రీస్తుపూర్వం 1400 సంవత్సరంలో ఇక్కడ నివాసాలుండేవి. ఈ పట్టణంలో 500 మంది ఉండేవారిని సమాచారం. ఫ్రాన్స్, సౌదీ పరిశోధకుల బృందం నేతృత్వంలో ఈ పరిశోధన కొనసాగింది. ఇక్కడ 50 కంటే ఎక్కువ ఇళ్లు దాదాపు 14.5 కిలోమీటర్ల పొడవునా గోడ నిర్మించి ఉంది
4 వేల ఏళ్లనాటి ప్రాచీన సంపద సౌదీ అరేబియాలోని నార్త్ వెస్ట్ ప్రాతంలో ఖైబర్ ఎడారిలో పురావస్తు శాస్త్రవేత్తలకు 4 వేల ఏళ్ల నాటి ఓ పట్టణం కన్పించింది. ఈ పట్టణాన్ని అల్ నతాహ్ అని పేరు పెట్టారు. ఈ పట్టణం కాంస్యయుగం నాటిదని తెలుస్తోంది.