Vande Bharat Express Fares: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టికెట్ రేట్లు ఇవే!

i Vande Bharat Express Fares List: రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రేట్ల వివరాలు చూద్దాం

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 8, 2023, 09:59 AM IST
Vande Bharat Express Fares: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టికెట్ రేట్లు ఇవే!

Secunderabad Tirupati Vande Bharat Express Fares List: సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య రాకపోకలు సాగించనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ను రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రేపు సికింద్రాబాద్‌లోని ప్లాట్‌ఫామ్‌ 10 నుంచి ఈ రైలు బయలుదేరనుంది. ఈ నేపథ్యంలోనే పదో నంబరు ప్లాట్‌ఫామ్‌ వద్ద ఉన్న రైల్వేలైనును శుభ్రం చేసి రంగులద్ది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు రైల్వే అధికారులు.

ఇక ఈ క్రమంలోనే ప్రధాని పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు ఈ మేరకు ఉన్నాయి. ఇక అను నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ నడుస్తున్నాయి, ఆలా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో 12 గంటల ప్రయాణం ఉంటుంది. కానీ ఈ వందే భారత్ ట్రైన్ లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల ప్రయాణం మాత్రమే  ఉంటుంది.

Also Read: Telugu Born Actresses: ఈ పాతిక మంది స్టార్ హీరోయిన్లు తెలుగు వారే అని తెలుసా.. ఎక్కడ పుట్టారంటే?

మన దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్ కాగా ఇందులో 8 కోచ్ లు ఉండనున్నాయి మొత్తం 530 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇక ఈ ట్రైన్లో  1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్ లు ఉన్నాయి. ఇక ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్ లను పెంచే అవకాశం ఉందని కూడా అంటున్నారు. రేపు ఉదయం 11.30 నుంచి 12.05 లోపు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం కానుండగా ఈనెల 9 నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణికులకు అందుబాటులోకి వందే భారత్ ట్రైన్ రానుంది.

ఇక రేపటి వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు అని తెలుస్తోంది. ఇక రేట్ల విషయానికి వస్తే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ ఛార్జ్ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జ్ 3080 రూపాయలుగా ఉండనుండగా తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జ్ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జ్ 3030 రూపాయలు ఉండనున్నాయి. అయితే వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోకలు ఉండనున్నాయి. ఒక వేళ రద్దీ ఉంటే కనుక ఆ ఒక్క రోజు కూడా నడిపే అవకాశం ఉంది. 
Also Read: Mahesh SVSC: మహేష్ సీతమ్మవాకిట్లో చేయడానికి ప్రభాస్ కారణమట.. ఎలాగో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News