Side effects of Flax seeds: ఫిట్నెస్ అనేది అందరికీ కావల్సిందే. కొందరే దీన్ని అలవర్చుకుంటారు. కొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాదు. చాలామంది ఫిట్నెస్ కోసం ఫ్లక్స్సీడ్స్ సేవిస్తుంటారు. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పెరుగుతున్న బరువు సులభంగా తగ్గుతుంది. ఫ్లక్స్సీడ్స్లో ఫైటోకెమికల్స్, లిగ్నన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనకరం. అయినా ఒక్కోసారి ఈ అవిశె గింజలు అనర్ధాల్ని కూడా తీసుకొస్తాయి.
ఫ్లక్స్సీడ్స్ అతిగా తీసుకుంటే కలిగే అనర్ధాలు
కడుపులో సమస్య
అవిశె గింజల్ని రోజూ అవసరానికి మించి తీసుకుంటే డయేరియా సమస్య రావచ్చు. దాంతో పాటు ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్య ఉత్పన్నమౌతుంది. ప్రేవుల్లో సమస్య ఉన్నవాళ్లు అవిశె గింజలకు దూరంగా ఉండటం మంచిది. అందుకే డైటిషియన్ సలహా మేరకే ఫ్లక్స్సీడ్స్ సేవించాలి.
మలబద్ధకం సమస్య
అవిశె గింజలను రోజూ అవసరానికి మించి తింటూ నీళ్లు తక్కువ తాగుతుంటే ప్రేవుల్లో ఆటంకం ఏర్పడుతుంది. అందుకే అవిశె గింజలు ఆరోగ్యపరంగా ఎంత మంచివైనా సరే మోతాదుకు మించి తీసుకోకూడదు.
ఎలర్జీ సమస్యలు
చాలామంది అత్యుత్సాహంతోనో లేక తెలియకో ఎక్కువ మోతాదులో ఫ్లక్స్సీడ్స్ తింటుంటారు. దీనివల్ల ఎలర్జా సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే ఫ్లక్స్సీడ్స్ను సాధ్యమైనంతవరకూ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.
Also Read: Diabetes Tips: ఈ ఆకుల్ని రోజూ నమిలి తింటే చాలు..నెలరోజుల్లో డయాబెటిస్ మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook