Investment Tips: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి

Financial Rules Changed From 1st April 2023: కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్న తప్పకుండా మారిన నిబంధనలు తెలుసుకోండి. ప్రభుత్వ పథకాల్లో వడ్డీ రేట్లలో మార్పులతోపాటు పెట్టబడి లిమిట్‌ కూడా మారింది. పూర్తి వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 05:11 PM IST
Investment Tips: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి

Financial Rules Changed From 1st April 2023: కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 శనివారం నుంచి ప్రారంభమైంది. ఆర్థిక సంవత్సరంలో మార్పుతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. అనేక పొదుపు పథకాల్లో కూడా కీలక మార్పలు జరిగాయి. మహిళా సమ్మాన్ సేవింగ్స్ లెటర్, బీమా పాలసీలు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, బాండ్లు వంటి వాటిలో నిబంధనలు మారాయి. ట్యాక్ సేవింగ్ కోసం పెట్టుబడి పెడుతున్న వారు తప్పకుండా మారిన నిబంధనలు తెలుసుకోవాలి. 

మహిళా సమ్మాన్ సేవింగ్స్ లెటర్

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంలో మహిళలకు రెండేళ్ల డిపాజిట్లపై మాత్రమే 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం కింద మహిళలు మాత్రమే అకౌంట్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మైనర్ బాలిక పేరుతో సంరక్షకులు అకౌంట్ తెరవవచ్చు. 2025 మార్చి 31 వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.  దీంతో పాటు పాక్షిక ఉపసంహరణ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. రెండేళ్ల తర్వాత పథకం మెచ్యూరిటీ ముగిసిన అనంతరం ఫారమ్-2 దరఖాస్తును పూరించిన తర్వాత ఖాతాదారులకు మొత్తం డబ్బులు ఇస్తారు.

పథకం వ్యవధిలో ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత.. ఖాతాదారుల మొత్తంలో 40 శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఖాతాదారుడు మైనర్ అయితే.. ఫారం-3ని పూరించిన తర్వాత మెచ్యూరిటీ తర్వాత గార్డియన్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మెచ్యూరిటీకి ముందు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ ఖాతా మూసివేయడం అస్సలు కుదరదు.  

బీమాపై ఇలా..

ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ప్రీమియం ఉన్న బీమా పాలసీ విషయంలో  అందుకున్న మొత్తంపై ట్యాక్స్ బెనిఫిట్ పరిమితి ముగుస్తుంది. ఏప్రిల్ 1 తరువాత జారీ చేసిన అన్ని జీవిత బీమా పాలసీల (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా యులిప్ కాకుండా) మెచ్యూరిటీ మొత్తం, వార్షిక ప్రీమియం ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టే వ్యక్తులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుభవార్త అందించింది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి లిమిట్ గతంలో రూ.15 లక్షలు ఉండగా.. లిమిట్‌ను రూ.30 లక్షలకు పెంచింది. నేటి నుంచి సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో సురక్షితమైన పెట్టుబడి ఎంపికతో పాటు మంచి రాబడిని పొందవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు 8.20 శాతానికి పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం 2022-23 చివరి త్రైమాసికంలో ఇది 8 శాతంగా ఉంది. అంతేకాదు ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల బెనిఫిట్‌ను పొందుతారు.

బాండ్లపై ఇలా..

నేటి నుంచి బాండ్లు లేదా స్థిర ఆదాయ ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్‌పై స్వల్పకాలిక మూలధన లాభాలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పెట్టుబడిదారులు బాండ్లపై లాంగ్‌టర్మ్‌లో ట్యాక్స్ బెనిఫిట్స్ పొందారు. ప్రస్తుతం బాండ్లు లేదా స్థిర ఆదాయ ఉత్పత్తులతో అనుసంధానించిన మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు మూడేళ్లపాటు మూలధన లాభాలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల తరువాత ఈ నిధులు ద్రవ్యోల్బణం ప్రభావం లేకుండా 20 శాతం లేదా ద్రవ్యోల్బణం ప్రభావంతో 10 శాతం పొందవచ్చు.

Also Read: LSG vs DC: లక్నో Vs ఢిల్లీ జట్ల మధ్య టఫ్‌ వార్.. ప్లేయింగ్ 11 ఇదే..!  

Also Read: Kane Williamson: అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు.. కానీ వెంటాడిన దురదృష్టం.. సీజన్ మొత్తానికి దూరం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News