Coronavirus Cases in India: కరోనా నుంచి కోలుకుని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ తరుణంలో మరోసారి ఆ మహమ్మారి వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో రోజూ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.పెరుగుతున్న కేసులు, కరోనా నివారణ చర్యలును సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. కేసుల పెరుగుదలపై మరింత నిఘాను పెంచడం.. తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) అన్ని కేసులను పరీక్షించడం, జీనోమ్ సీక్వెన్సింగ్‌ను వేగవంతం చేయడంపై ప్రధాని కీలక సూచనలు ఇచ్చారు. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులపై కూడా చర్చించారు.
ఈ భేటీ వివరాలను పీఎంవో కార్యాలయం వెల్లడించింది. ప్రజలు జాగ్రత్త ఉండాలని ప్రధాని మోదీ సూచించారని తెలిపింది. గత కొన్ని నెలల్లో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసుల సంఖ్యను కూడా ప్రధానికి అధికారులు వివరించారు. సీనియర్ సిటిజన్లు, ఇతర వ్యాధులతో బాధపడేవారు రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనా నియంత్రణకు అధికారులకు కీలక సూచనలు చేశారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ప్రధానికి అధికారులు వివరించారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi held a high-level meeting today to review the Covid-related situation and public health preparedness. pic.twitter.com/857Lfj08ec
— ANI (@ANI) March 22, 2023
ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఐసీఎంఆర్ రాజీవ్ బెహల్, నీతి ఆయోగ్ వీకే పాల్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు దేశంలో బుధవారం 1100 పైగా కరోనా కేసులు నమోదయ్యాయని. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,134 కొత్త కోవిడ్ కేసులు నమోదవ్వగా.. ఐదుగురు కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్‌గా ఉన్న రోగుల సంఖ్య 7,026కి పెరిగింది. కరోనా మరణాల సంఖ్య 5,30,813కు పెరిగింది. దేశంలో సోకిన వారి సంఖ్య 4,46,98,118కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 4,41,60,279 మంది రోగులు కరోనాను జయించారు. ఇప్పటివరకు 220.65 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం. మంగళవారం 699 కోవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Also Read: Ind Vs Aus: ఫైనల్ ఫైట్‌లో ఆసీస్ హిట్.. భారత్ ఫ్లాప్ షో.. సిరీస్ కంగారూలదే..
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి