Comedian Brahmanandam Birthday బ్రహ్మానందం పేరు లేకుండా తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పలేం. ఆయనకంటూ సపరేట్ అధ్యాయం ఉంటుంది. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సినిమాలో ఉంటే ఇక చాలు అనుకునే స్థాయికి ప్రేక్షకుడు వచ్చాడు. బ్రహ్మానందం ఇప్పటి తరానికి జిఫ్ గాడ్, మీమ్స్ దేవుడు, ట్రోల్స్ రారాజు అని అంటుంటారు. ఇప్పుడు బ్రహ్మానందం సినిమాలను కాస్త తగ్గించాడు. కానీ ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చేది. స్టార్ హీరోల సినిమాలకు బ్రహ్మానందం ఆయువు పట్టులా ఉండేవాడు.
రామ్ రెడీ అయినా మహేష్ బాబు దూకుడు, ఆగడు అయినా, ఎన్టీఆర్ అదుర్స్ సినిమా అయినా కూడా బ్రహ్మానందమే పస్ల్ పాయింట్. బ్రహ్మానందం కోసం సపరేట్ ట్రాక్ రాసుకుంటూ ఉండేవారు దర్శకులు. త్రివిక్రమ్ అయితే బ్రహ్మానందం కోసం మంచి ట్రాక్ రాసుకుంటాడు.ఇక శ్రీనువైట్ల అయితే సెకండాఫ్ మొత్తాన్ని బ్రహ్మానందం మీద వదిలేస్తుంటాడు.
బ్రహ్మానందం చుట్టూనే కథను తిప్పుతుంటారు. అలా ఎంతో మంది దర్శకులు బ్రహ్మానందంతో కామెడీ చేయించి హిట్ కొట్టేసుకున్నారు. అయితే ఇప్పుడు బ్రహ్మానందం తన ఆరోగ్య సమస్యలతో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు రంగమార్తాండ సినిమాతో బ్రహ్మానందం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టించేందుకు రెడీగా ఉన్నాడు.
సోషల్ మీడియాలో బ్రహ్మానందంని చూడని రోజంటూ ఉండదు. ఏ జిఫ్ ఫైల్ చూసినా కూడా బ్రహ్మానందం కనిపిస్తాడు. ఏ మీమ్ చూసినా బ్రహ్మానందం కనిపిస్తాడు. ఏ ట్రోల్ వీడియోలో చూసినా బ్రహ్మానందమే కనిపిస్తాడు. అలా బ్రహ్మానందాన్ని చూస్తేనే మహదానందంగా అనిపిస్తుంటుంది. అలా ఇప్పుడు బ్రహ్మనందం జిఫ్ గాడ్‌గా మారిపోయాడు.
అలాంటి బ్రహ్మానందంలోనే హిడెన్ టాలెంట్ ఉంది. ఆయన గీసే దేవుడి బొమ్మ పటాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఆయన కరోనా సమయంలో దేవుడి చిత్ర పటాలను గీసేవాడు. వాటిని సెలెబ్రిటీలకు గిఫ్ట్‌గా ఇస్తుండేవాడు. అలాంటి బ్రహ్మనందం నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఆయన జీ తెలుగు న్యూస్ తరుపును పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
Also Read: Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్ సినిమా క్యాస్టింగ్ ఇదే
Also Read: Sai Pallavi : జీవితంలో అవి ఉంటే చాలట.. నవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
HBD Brahmanandam : బ్రహ్మానందం పుట్టిన రోజు.. ఆయన్ను చూస్తేనే మనకు మహదానందం
బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్
కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా బ్రహ్మానందం
సోషల్ మీడియాకు బ్రహ్మానందం ఊపిరి