Danish Kaneria wants Shubman Gill to replaced by Prithvi Shaw in IND vs NZ 3rd T20I: ఆదివారం లక్నోలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌కు చాలా కష్టమైన పిచ్‌పై భారత బౌలర్ల ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్లకు 99 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ కష్టంగానే ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ గెట్టెక్కింది. ఈ విజయంతో సిరీస్ 1-1 తేడాతో సమంగా నిలిచింది. ఆహ్మదాబాద్ వేదికగా జరిగే మూడో టీ20లో గెలిచిన జట్టుట్రోఫీ విజేతగా నిలవనుంది.
టెస్టుల్లో, వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్న యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. టీ20ల్లో మాత్రం దారుణంగా విఫలమవతున్నాడు. పొట్టి సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో గిల్ 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో గిల్ స్థానంలో మరో యువ ఓపెనర్ పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. మూడో టీ20లో గిల్‌కు బదులుగా పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సూచించాడు.
డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ... 'చివరి మ్యాచ్ మిగిలివుంది. టీ20లో శుభమాన్ గిల్ ఎలా ఆడాడో మనం చూశాం. పృథ్వీ షా అద్భుతమైన యువ క్రికెటర్. అతను అటాకింగ్ గేమ్‌కు పేరుగాంచాడు. గిల్ స్థానంలో అతనికి అవకాశం ఇవ్వవచ్చు. షాకు మంచి నైపుణ్యం ఉంది. అతను నిలకడగా ఆడితే అద్భుతాలు చేయగలడు. గిల్ అద్భుతమైన బ్యాటర్ అనడంలో సందేహం లేదు. అయితే అతను బ్యాటింగ్‌లోని లోపాలను సరిద్దుకోవాలి. స్పిన్ మరియు బౌన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. భారత్ గెలిచింది కానీ సరిద్దుకోవాల్సినవి చాలానే ఉన్నాయి' అని అన్నాడు. స్పెషలిస్ట్ కీపర్ల కొరత కారణంగా ఇషాన్ కిషన్‌ను తుది జట్టు నుంచి తొలగించలేమని కనేరియా పేర్కొన్నాడు.
గతేడాది చివరలో శ్రీలంకపై టీ20ల్లో శుభమాన్ గిల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 5 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 15.2 సగటుతో 72 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 46 పరుగులు. రాంఛీ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 పరుగులు చేసిన గిల్ .. లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో 11 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో గిల్ కేవలం టెస్టులకు, వన్డేలకు మాత్రమే పనికొస్తాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.