Side Effects Of Eating Eggs: కోడిగుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే రోజూ కోడిగుడ్డు తినమని వైద్యులు సూచిస్తారు. ఈ కోడిగుడ్లలో ప్రోటీన్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీనిని సూపర్ పుడ్ అంటారు. అయితే ఈ వ్యాధులు ఉన్నవారు గుడ్లను తింటే రోగం మరింత ముదిరే అవకాశముంది. ఆ 5 రకాల వ్యాధులు ఏంటో తెలుసుకుందాం.
1. గుండె జబ్బు
గుండెపోటు రాకుండా ఉండాలంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. గుండె జబ్బులు ఉన్నవారు గుడ్లను ఎక్కువగా తీసుకుంటే ఇది వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది.
2. చర్మ సమస్య,
గుడ్లను ఎక్కువగా తీసుకుంటే చర్మ సమస్యలు తలెత్తుతాయి. ముఖంపై మెుటిమలు రావడం ప్రారంభిస్తాయి. గుడ్ల తినడం వల్ల హార్మోన్లలో మార్పు వస్తుంది.
3. జీర్ణవ్యవస్థ దెబ్బతినవచ్చు
మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకున్నా, గ్యాస్, అసిడిటీ వంటి వ్యాధులు ఉన్నవారు గుడ్లు తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను పెంచుతుంది.
4. క్యాన్సర్ ప్రమాదం
ప్రతి సంవత్సరం చాలా మంది క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు. మీరు ఎక్కువగా గుడ్లు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
5. మధుమేహం
రోజూ గుడ్ల రెండు లేదా మూడు కంటే ఎక్కువగా తినకూడదు. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలో మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా శరీరం ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటుంది.
Also Read: Shani Dev: మరో 5 రోజుల్లో అస్తమించనున్న శనిదేవుడు.. ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Egg Side Effects: ఈ జబ్బులు ఉన్నవారు పొరపాటున కూడా గుడ్లు తినకండి, తింటే అంతే..!