Lakshmi Narayan Raj Yog: గ్రహాల సంచారం, తిరోగమన దశలు ప్రతి రాశిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీని వల్ల అన్ని రాశులవారి జీవితంలో తీవ్ర మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి రాశులు సంచారం జరిగే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే నిన్న జరిగిన బుధ గ్రహం సంచారంతో పలు మార్పులు జరగబోతున్నాయి. అంతేకాకుండా ఇదే నెలలో శుక్ర గ్రహం కూడా సంచారం చేయడంతో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో మూడు రాశువారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
ఈ రాశువారికి ధనమే ధనం:
సింహ రాశి:
సింహ రాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం వల్ల చాలా ప్రయోజనం కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సింహ రాశివారికి సంతాన సౌభాగ్యం కలిగే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో చేడు పనులు చేయడం వల్ల తీవ్ర దుష్ర్పభావాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యాపారాల పరంగా మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి.
కన్య:
బుధ, శుక్రు గ్రహాల కలయిక వల్ల లక్ష్మీ నారాయణ రాజయోగం కన్యా రాశి వారికి ఏర్పడుతుంది. దీంతో వీరికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. భౌతికంగా సుఖాలు లభిస్తాయి. ఆస్తిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో తల్లితో మధురమైన సంబంధాలు ఏర్పడతాయి.
ధనుస్సు రాశి:
లక్ష్మీ నారాయణ రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో మార్పులు జరిగి చాలా వరకు పురోగతి కనిపిస్తుంది. అంతేకాకుండా వీరిపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ క్రమంలో ధనస్సు రాశి వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
Also Read: Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు
Also Read: Harish Rao: ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్ధానం ఏమైందన్న మంత్రి హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
Lakshmi Narayan Raj Yog: ఈ రాశువారికి లక్ష్మీనారాయణ రాజయోగం.. 15 రోజులు డబ్బే..డబ్బు..