SONIA GANDHI: గెహ్లాట్ జీ జ‌ర పార్టీ ప‌గ్గాలు తీసుకుంటారా..! అభ్యర్థించిన కాంగ్రెస్ చీఫ్ సోనియా..?

SONIA GANDHI: రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి, సీనియ‌ర్ నేత అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించాల‌ని స్వ‌యంగా సోనియా గాంధీయే అడిగిన‌ట్టు తెలిసింది. సెప్టెంబ‌ర్ 21వ తేదీన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకోవాల్సిన నేప‌థ్యంలో అధిష్టానం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం

Written by - Srisailam | Last Updated : Aug 24, 2022, 05:18 PM IST
  • కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై సస్పెన్స్
  • రాహుల్, ప్రియాంక విముఖత
  • అశోక్ గెహ్లాట్ కు అప్పగిస్తారా?
SONIA GANDHI: గెహ్లాట్ జీ జ‌ర పార్టీ ప‌గ్గాలు తీసుకుంటారా..! అభ్యర్థించిన కాంగ్రెస్ చీఫ్ సోనియా..?

SONIA GANDHI:  రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి, సీనియ‌ర్ నేత అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించాల‌ని స్వ‌యంగా సోనియా గాంధీయే అడిగిన‌ట్టు తెలిసింది. సెప్టెంబ‌ర్ 21వ తేదీన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకోవాల్సిన నేప‌థ్యంలో అధిష్టానం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. సోనియా గాంధీ వ‌యో, ఆరోగ్య సంబంధిత సమ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ారు. రాహుల్, ప్రియాంక‌ గాంధీలు పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించేందు సుముఖ‌త చూప‌క‌పోవ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. దానికి తోడు రాహుల్ భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోనున్నది.

పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌ గాంధీ మొగ్గు చూపడం లేదు. ప్రియాంక గాంధీ సైతం అధ్యక్ష రేసులో ఉన్నా.. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆమెకు బాధ్యతలు అప్పగించేందుకు సంసిద్ధంగా లేనట్లు తెలుస్తున్నది. దీంతో దశాబ్దాల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యపీఠంపై కూర్చోబెట్టనున్నద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతుంది. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.. తమ కుటుంబానికి విధేయుడైన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తున్నది. అందుకే అశోక్‌ గెహ్లాట్ ను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే సెప్టెంబర్‌ 21 నాటికి పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకం జరుగనున్నది. ఈ క్రమంలో పార్టీ వివరణాత్మక ప్రకటన చేయనున్నది. మరో వైపు సోనియా మంగళవారం రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌ను ఆయన నివాసంలో కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ పగ్గాలు చేపట్టాలని గెహ్లాట్‌ను కోరినట్లు తెలుస్తున్నది. అనారోగ్య కారణాలతో పార్టీ బాధ్యతలు నిర్వహించలేనని సోనియా గాంధీ గెహ్లాట్‌తో చెప్పినట్లు తెలియవచ్చింది.

సోనియా గాంధీని కలిసిన తర్వాత గెహ్లాట్ ఢిల్లీ విమానాశ్రయంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అధ్యక్షుడైన తర్వాతే పార్టీని పునర్నిర్మించగలమని తాను పదేపదే చెబుతున్నానన్నారు. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించకుంటే నాయకులు, కార్యకర్తలు నిరాశకు గురవుతారన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని నిరంతరం ఒత్తిడి తెస్తామన్నారు. మరో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ససేమిరా అంటే.. ఎవరూ బలవంతం చేయలేరని అన్నారు. మరో వైపు గెహ్లాట్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పాటు సచిన్‌ పైలట్‌ను సీఎంగా వచ్చే రాజస్థాన్‌ ఎన్నికల బరిలోకి దింపనున్నది. ఇటు విధేయుడికి పార్టీలో కీలక పదవిని కట్టబెట్టడంతో పాటు రాజస్థాన్‌ నేతల్లో ఉన్న అసంతృప్తి నేతలకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తనకు అప్పగించే విషయం తెలియదని రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ తనకు బాధ్యతలు అప్పగించబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.  మీడియా ద్వారానే ఈ వార్తను వింటున్నానని అన్నారు. తనకు పార్టీ అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తున్నానని..రానున్న ఎన్నికలకు గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పరిశీలకుడిగా ఉన్నానని తెలిపారు. రాజస్థాన్ లో తనకున్న బాధ్యతల విషయంలోనూ రాజీపడబోనని తెలిపారు. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో అశోక్ గెహ్లాట్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనియాకు వయసు మీద పడిపోవడం, రాహుల్ అధ్యక్ష బాధ్యతలకు విముఖంగా ఉండడంతో ప్రత్యామ్నాయం కోసం పార్టీ వెతుకుతోంది.

READ ALSO: MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ లాయర్ కు బెదిరింపులు.. హైదరాబాద్ లో మరో కలకలం

READ ALSO: CM Jagan Comments: ఆ పని చేశాకే ఎన్నికలకు వెళ్తా... ఏపీలో హాట్ హాట్ గా మారిన సీఎం జగన్ కామెంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News