EPS 95 Pension: ఈపీఎస్ 95 పెన్షనర్లకు శుభవార్త చెప్పనున్న మోదీ సర్కార్.. ఫిబ్రవరి 1న కీలక నిర్ణయం తీసుకునే అవకాశం


EPS 95 Pension Update: కేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలోనే ఈపీఎస్ 95పెన్షనర్లకు శుభవార్త వినిపించనున్నారు. ఈపీఎస్ 95 పెన్షన్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలంగా పెన్షన్ పెంపు కోసం ఎదురుచూస్తున్న పెన్షనర్లకు కొత్త ఏడాదిలో ఊరట లభించే ఛాన్స్ ఉంది. 
 

1 /7

EPS 95 Pension Update: కేందరంలోని మోదీ సర్కార్ త్వరలోనే ఈపీఎస్ 95 పెన్షనర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా పెన్షన్ పెంపుకోసం ఎదురుచూస్తున్న పెన్షనర్లకు ఈ సంవత్సరం ఊరట లభించే ఛాన్స్ కనిపిస్తోంది.   

2 /7

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్ల డిమాండ్ హయ్యర్ పెన్షన్ డిమాండ్ విషయంలో సానుకూలంగా స్పందించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్లో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   

3 /7

ఇప్పటికే సుప్రీంకోర్టు ఈపీఎస్ 95 పెన్షనర్ల విషయంలో హయ్యర్ పెన్షన్ అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తులను కూడా స్వీకరిస్తోంది.   

4 /7

ఈపీఎస్ 95 పెన్షనర్ల విషయంలో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ను తాజాగా ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కీలక నిర్ణయం పెన్షన్ పెంపు ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 

5 /7

ఇదెలా ఉండగా దేశవ్యాప్తంగా దాదాపు 78లక్షల మంది ఈపీఎస్ 95 పింఛన్ దారులు 30 నుంచి 45ఏళ్లుగా పైగా ఉద్యోగ సర్వీసు చేసినప్పటికీ చాలా తక్కువ పెన్షన్ పొందుతున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పరిష్కారంచూపాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.   

6 /7

కనీస పెన్షన్ రూ. 7,500 తోపాటు డీఎ, పెన్షన్ దారులకు ఆరోగ్య ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నామని ఈపీఎస్ 95 పెన్షన్ హయ్యర్ పెన్షన్ సాధన సమితి నేతలు పేర్కొంటున్నారు. 

7 /7

హయ్యర్ పెన్షన్ను ఎంచుకున్న వారు ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటుంది. సభ్యులందరికీ కనీస పెన్షన్ రూ. 7,500 తోపాటు డీఏ కలిపి అందించాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.