India Post Recruitment 2022: ఇండియాన్‌ పోస్టల్‌లో త్వరలోనే భారీ రిక్రూట్‌మెంట్.. ఇలా అప్లై చేసుకోండి..!

India Post Recruitment 2022: భారత్‌లో నిరుద్యోగులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పబోతోంది. యువతకు సువర్ణావకాశం అందించేందుకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో త్వరలోనే పోస్టులను భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2022, 02:58 PM IST
  • ఇండియా పోస్టల్‌లో త్వరలోనే..
  • భారీ రిక్రూట్‌మెంట్‌కి అవకాశం
  • కింద ఉన్న లింక్‌లో పూర్తి వివరాలు
India Post Recruitment 2022: ఇండియాన్‌ పోస్టల్‌లో త్వరలోనే భారీ రిక్రూట్‌మెంట్.. ఇలా అప్లై చేసుకోండి..!

India Post Recruitment 2022: భారత్‌లో నిరుద్యోగులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పబోతోంది. యువతకు సువర్ణావకాశం అందించేందుకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో త్వరలోనే పోస్టులను భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా పోస్ట్ (Dak Vibhag Vacancy 2022)ద్వారా రిక్రూట్‌మెంట్ పూర్తైయిన వెంటనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే ఈ వివరాలను ఆసక్తికర అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో indiapost.gov.in తెలుసుకోవచ్చు. ఈ  రిక్రూట్‌మెంట్‌లో భారత పోస్టల్ డిపార్ట్‌మెంట్‌  మొత్తం 26 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. కావున అసక్తికర అభ్యర్థులు పోస్టులు పడ్డ వెంటనే అప్లై చేసుకోగలరు.

ఇండియా పోస్ట్ భారతి 2022(India Post GDS Bharti 2022) ఖాళీల వివరాలు:
 

మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 26 వేలలు
పోస్టుల పేరు: గ్రామీణ డాక్ సేవక్ భారతి 2022(Gramin Dak Sevak)

50 వేలకు పైగా పోస్టులు:

అధికారుల సమాచారం మెరకు ఈ పోస్టుల ఖాళీని త్వరలోనే రిక్రూట్‌ చేసియనున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఇండియా పోస్ట్‌లో 50 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నందున..రిక్రూట్‌మెంట్ సంబంధిత నోటిఫికేషన్ త్వరలోనే వెలుబడనుంది.

విద్యా అర్హతలు:

భారత్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ కొన్ని అభ్యర్థులకు కొన్ని ఆర్హతను పెట్టింది. ఆ ఆర్హతల ద్వారానే రిక్రూట్‌  చేసుకోనంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన భారత విద్య సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 40 సంవత్సరాలు ఉండాలని భారత్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది.

ఎలా దరఖాస్తు చేయాలి:

>> ఈ పోస్టుల దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.inలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
>> గ్రామీణ డాక్ సేవక్, ప్యూన్ పోస్టులకు సంబంధించిన పోస్టు రిక్రూట్‌మెంట్ కోసం పై లింక్‌ని క్లిక్‌ చేయండి.
>> ఆ వెబ్‌సైట్‌లోనే ఒక పామ్‌ నింపాల్సి ఉంటుంది.
>> అభ్యర్థించిన సమాచారాన్ని ఇక్కడ నింపిన తర్వాత.. ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవ

Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News