Jamun Benefits: ఆధునిక జీవన శైలిలో ఎదురౌతున్న ప్రధాన సమస్య స్థూలకాయం. బరువు తగ్గించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఆ పండ్లతో ఇలా చేస్తే మాత్రం వారాల వ్యవధిలోనే స్థూలకాయానికి చెక్ పెట్టవచ్చు..
ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వర్కింగ్ స్టైల్ కారణంగా బరువు పెరగడం ప్రధాన ఇబ్బందిగా మారుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ వాకింగ్, యోగా, డైటింగ్, వర్కవుట్స్ ఇలా వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇంకొంతమందైతే తిండి మానేస్తుంటారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తిండి మానేయడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. అందుకే ప్రకృతిలో లభించే కొన్ని పండ్లతో బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. ఇందులో ప్రముఖమైంది నేరేడు పండు. నేరేడు పండ్లలో కేలరీలు చాలా తక్కువ. దీంతోపాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండింటి కారణంగా బరువు తగ్గడంలో నేరేడు పండ్లు బాగా ఉపయోగపడుతాయి. అయితే నేరేడు పండ్లతో బరువు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..
బరువు తగ్గించేందుకు నేరేడు పండ్లను నేరుగా తిన్నా మంచి ఫలితాలుంటాయి. రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగౌతుంది. మలబద్ధకం సమస్య పోతుంది. దాంతో మెటబోలిజం వేగవంతమై..బరువు తగ్గడంలో దోహదపడుతుంది. వేగంగా బరువు తగ్గాలంటే..ఉదయం వేళ పరగడుపున తినాలి.
నేరేడు జ్యూస్ రూపంలో
నేరేడు పండ్లు నేరుగా తినలేకపోతే..జ్యూస్ చేసుకుని తాగినా ఫరవాలేదు. నేరేడు జ్యూస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఒక గ్లాసు నేరేడు పండ్ల జ్యూస్ తాగితే బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. స్నాక్స్‌లో కూడా నేరేడు పండ్ల జ్యూస్ తాగవచ్చు. నేరేడు పండ్ల జ్యూస్ తాగడం వల్ల కడుపు నిండినట్టుగా ఉండి..త్వరగా ఆకలేయదు. నేరేడు పండ్లు, తేనె, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ చేసుకుంటే జ్యూస్ రెడీ అయిపోతుంది.
నేరేడు పండ్ల స్మూదీ
రోజూ ఉదయం నేరేడు పండ్లతో చేసిన స్మూదీ కూడా తీసుకోవచ్చు. ఉదయం వేళ నేరేడు పండ్ల స్మూదీ తాగితే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. దాంతోపాటు త్వరగా ఆకలనేది వేయదు. ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. స్మూదీ తయారు చేసేందుకు ఒక గ్లాసు పాలలో గింజ తీసిన నేరేడు పండ్లను వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో తేనె, గులాబి ఆకులు, ఐస్ ముక్కలు వేసి సేవించాలి.
Also read: Hair Care Tips: హెయిర్ స్ట్రైటనింగ్ తరువాత ఆ సమస్యలు ఎదురౌతున్నాయా...ఇలా చేయండి చాలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook