CM Jagan: వరద సహాయక చర్యలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు. గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించారు.
రేపు గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు హై అలర్ట్‌గా ఉండాలని..ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు సీఎం. పోలవరం, ధవళేశ్వరం, లంక గ్రామాలను పరిశీలించారు. అక్కడి వరద పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. వరద బాధితుల్లో ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలను 48 గంటల్లో అందజేయాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం తక్షణం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్లను వినియోగించుకోవాలన్నారు.
Also read:Attack on MP Arvid: ఎంపీ అర్వింద్‌పై మరోసారి దాడి..ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా ఆరా..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook