Rashid Khan said Its very difficult to bowl to Shubman Gill: ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేటి బ్యాటర్లు సైతం అతడి బౌలింగ్‌లో తడబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పరుగులు రాబట్టడానికి భారీ హిట్టర్లు కూడా నానా తంటాలు పడుతుంటారు. అందుకే అతితక్కువ సమయంలో టీ20 క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రషీద్ తన స్పిన్ మాయాజాలంతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు.
ఐపీఎల్ 2022లో 16 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్.. 6.59 ఎకానమీతో 19 వికెట్లు పడగొట్టి గుజరాత్ టైటాన్స్ టైటిల్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో తాను ఉన్నానంటూ జట్టుకు భరోసా ఇచ్చేవాడు. స్టార్ బ్యాటర్ల వికెట్లు పడగొట్టి మ్యాచును మలుపుతిప్పాడు. 2017లో ఐపీఎల్లో ఆడటం ప్రారంభించినప్పటి నుంచి వరుసగా ఆరోసారి ఈ ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ ప్రతి సీజన్లో కనీసం 17 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. ఇంతమంచి రికార్డు ఉన్న రషీద్.. ఓ బ్యాటర్‌కి బౌలింగ్ చేసేందుకు భయపడుతున్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు.
గుజరాత్ ఓపెనర్ శుభమన్ గిల్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టం అని రషీద్ ఖాన్ తెలిపాడు. 'శుభమన్ గిల్‌తో ఐపీఎల్ 2022 ఆడినందుకు చాలా గర్వంగా ఉంది. గిల్ చాలా కష్టపడే వ్యక్తి. మరోవైపు ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతాడు. అతడితో ఆడిన్నందుకు సంతోషంగా ఉంది. ఐపీఎల్ 2022లో గిల్ ఆడిన తీరు నమ్మశక్యంగా లేదు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అతడికి బౌలింగ్ చేయడం కష్టం. అయితే అదృష్టవశాత్తు ఇద్దరం ఒకే జట్టులో ఉన్నాం'అని రషీద్ పేర్కొన్నాడు.
శుభమన్ గిల్ గతేడాది వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 ముందు కోల్‌కతా అతడిని వేలంలోకి వదిలేయగా.. గుజరాత్ కొనుగోలుచేసింది. ఐపీఎల్ 2022లో గిల్ 16 మ్యాచ్‌ల్లో 34.50 సగటుతో 365 పరుగులు చేశాడు. గిల్ ఇప్పటివరకు 74 మ్యాచ్‌ల్లో 1900 రన్స్ చేశాడు.
Also Read: MS Dhoni Fan: ఎంఎస్ ధోనీ అంటే ఇదే.. అభిమానిని కలిసి కన్నీళ్లు తుడిచిన మహీ!
Also Read: ulberry For Health: మల్బరీ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook