TDP Mahanadu: మహానాడు వేదిక పైనుంచి వైసీపీ ప్రభుత్వంపై నందమూరి బాలకృష్ణ విమర్శలు...

TDP Mahanadu Balkrishna Speech: టీడీపీ మహానాడు వేదిక పైనుంచి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు నందమూరి బాలకృష్ణ.  మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొస్తేనే భావి తరాలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2022, 08:04 PM IST
 TDP Mahanadu: మహానాడు వేదిక పైనుంచి వైసీపీ ప్రభుత్వంపై నందమూరి బాలకృష్ణ విమర్శలు...

TDP Mahanadu Balkrishna Speech: ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రభుత్వం గుడినే కాదు.. గుడిలో లింగాన్ని మింగేసే రకమని ఎద్దేవా చేశారు. 'ఓటంటే నోటు కాదని తెలుసుకో.. ఓటుతోనే ఉంది రాజకీయం ముడిపడి.. ఓటును వృథా చేయకు తొందరపడి... ఓటు సవ్యంగా వేస్తేనే గుడి బడి.. ఇప్పుడున్న ప్రభుత్వం గుడినే కాదు గుడిలో లింగాన్ని మింగేసే రకం...' అంటూ బాలకృష్ణ విమర్శించారు.

వైసీపీ పాలనలో పెట్రోల్, డీజిల్ రేట్లు, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్ను, చెత్త పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు అన్నీ పెంచేసి ప్రజలకు ఊపిరాడకుండా చేశారని బాలకృష్ణ మండిపడ్డారు. మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.

ఎన్టీఆర్ శత జయంతిని ప్రస్తావిస్తూ... తెలుగువాళ్లకే కాదు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు బాలకృష్ణ. కులాలు, మతాలు, వైషమ్యాలకు ఎన్టీఆర్ దూరమని... నటుడిగా, రాజకీయ నేతగా ప్రజలు ఆయన్ను ఆదరించారని అన్నారు. ఎన్టీఆర్ శక పురుషుడు అని... సత్సంకల్పం, అకుంఠిత దీక్షనే మనిషిని మహోన్నత పథంలోకి నడిపిస్తుందని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారని అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అదరక బెదరక ముందుకు సాగిన ధీరోదాత్తుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

ఇక ఇదే సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఎంతో ముందుచూపుతో మిగతా రాష్ట్రాల కన్నా ముందే హైదరాబాద్‌కు ఐటీని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఆయన కృషితో ఎంతోమంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొస్తేనే భావి తరాలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

Also Read: Viral News: అరుదైన కేసు... భార్యతో 10ని. శృంగారం తర్వాత 'గజిని'లా మారిన వ్యక్తి... 

Also Read: Yama Raj Death Signals: మృత్యు గడియలు సమీపించే ముందు కనిపించే 4 సంకేతాలివే...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News