Revanth Reddy Letter to Amit shah: అమిత్ షాకు తొమ్మిది ప్రశ్నలు .. రేవంత్ ఘాటు లేఖ

Revanth Reddy Letter to Amit shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో .. హీట్ పుట్టిస్తోంది. పార్టీలు పరస్పర విమర్శల జోరు పెంచాయి. అధికార టీఆర్ఎస్‌ను బీజేపీ ఏకరేపు పెడితే.. కమలనాథులను గులాబీ దళం దుమ్మెత్తిపోస్తోంది. ఈ రెండు పార్టీలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు.

Written by - Attili | Edited by - Attili | Last Updated : May 29, 2022, 06:36 PM IST
  • అమిత్ షాకు లేఖ రాసిన రేవంత్ రెడ్డి
  • అమిత్ షాకు తొమ్మిది ప్రశ్నలు
  • కాకపుట్టిస్తున్న అమిత్ షా తెలంగాణ పర్యటన
Revanth Reddy Letter to Amit shah: అమిత్ షాకు తొమ్మిది ప్రశ్నలు .. రేవంత్ ఘాటు లేఖ

Revanth Reddy Letter to Amit shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో .. హీట్ పుట్టిస్తోంది. పార్టీలు పరస్పర విమర్శల జోరు పెంచాయి. అధికార టీఆర్ఎస్‌ను బీజేపీ ఏకరేపు పెడితే.. కమలనాథులను గులాబీ దళం దుమ్మెత్తిపోస్తోంది. ఈ రెండు పార్టీలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు.

తెలంగాణ ప్రజలకు హక్కుగా రావాల్సిన పథకాలన్నింటినీ బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి తుంగలో తొక్కాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికే రెండుసార్లు వచ్చిన మీరు.. ప్రతిసారీ సెంటిమెంట్ డైలాగు చెప్పడం తప్ప తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన మాట నెరవేర్చలేదన్నారు. తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి గడ్కారీ ఇటీవల కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారనీ.. మీ నాయకులు మాత్రం టీఆర్‌ఎస్‌తో లడాయి అంటూ తొడలు కొడుతుంటారని విమర్శించారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్ చీకటి సంబంధాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయన్నారు.

అమిత్ షాకు 9 ప్రశ్నలు

1.

కేసీఆర్ కుటుంబ అవినీతిని మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు ? ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే ఉపేక్షించడం వెనుక రహస్యం ఏంటి ? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరంగా పేరు మార్చి, రీ డిజైనింగ్ పేరుతో కేసీఆర్ కమిషన్లు దండుకున్నారు. ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. మరి మీరెందు చర్యలు తీసుకోవడం లేదు ? మిమ్మల్ని విమర్శించే వారిపై ఈడీ, సీబీఐతో దాడులు చేయించే మీరు..కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడానికి కారణమేంటి ?

2. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు ఆడిన డ్రామాలకు తెలంగాణ రైతులు మానసిక క్షోభ అనుభవించారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోయారు. ఈ మరణాలకు మీ రెండు పార్టీలు బాధ్యులు కారా ? తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లు చేయకూడదని కేసీఆర్‌తో మీరు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ బాయిల్డ్ రైస్  వంకను తెరపైకి తెచ్చారు. ఆ చికటి ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఎత్తేశారు. ధాన్యం కొంటే..7 వేల కోట్లు నష్టం వస్తుందని కేసీఆర్ అన్నారు.. వరి వేస్తే ఉరేనని హెచ్చరించారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమంటూ 2021 అక్టోబర్ లో ఎఫ్‌సీఐకి కేసీఆర్ లేఖ రాశారు. తాము ఆందోళనలకు దిగడంతో మాట మార్చింది నిజం కాదా ?

3. గత పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ అప్పుడు స్పందించక పోయినా మేం ఖండించాం. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై మీరు వివరణ ఇచ్చి, క్షమాపణలు చెప్పాలి. లేక పోతే మీ రాకను తెలంగాణ సమాజం ఎట్లా ఆమోదిస్తుంది ? తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేవని భావిస్తున్నారా ?

4. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. మీ మాటల నమ్మి నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి అరవింద్‌ను గెలిపించారు. పసుపు బోర్డు తెస్తానంటూ అరవింద్ స్వయంగా బాండ్ పేపర్‌పై రాసిచ్చారు. మూడేళ్లు అవుతున్నా పసుపు బోర్డు మాటే లేదు. దీనికేం సమాధానం చెబుతారు ? ఇది ప్రజల్ని మోసగించడం కాదా ?

5. ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి విభజన చట్ట ప్రకారం హామీ ఇచ్చింది. మీరు వచ్చాకా వీటికి మంగళం పాడారు. తెలంగాణకు కేంద్రం పదే పదే వట్టి చేతులు చూపిస్తోంది. మీకు టీఆర్‌ఎస్‌ అనేక సందర్భాల్లో మద్దతు ఇస్తూ వస్తోంది. ప్రజల్ని మోసం చేసిన మీ రెండు పార్టీలను ఎందుకు నమ్మాలి ? విభజన చట్టంలో ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ మాటేంటి ?

6. రామాయణ్ సర్క్యూట్ పేరుతో అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఉన్న పుణ్యక్షేత్రాలు కలుపుతూ శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్‌ప్రెస్‌ పేరిట రైలు ప్రవేశపెట్టారు. ఇందులో భద్రాద్రి రాముడికి చోటు ఎందుకు దక్కలేదు. భద్రాద్రి రాముడు రాముడు కాదా ?  రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నా మొండి చెయ్యే చూపారు. మీ దృష్టిలో అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు ఒకటి కాదా ?

7. ఒడిశాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ల అవినీతి వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి ఫిర్యాదు చేశాం. కానీ చర్యలు ఎందుకు తీసుకోలేదు ?

8. తెలంగాణలోని రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్కదానికి కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. అడిగే బుద్ధి టీఆర్‌ఎస్‌కు లేదు. మీ దుర్మార్గపు చట్టాలకు టీఆర్‌ఎస్ మద్దతు.. వారి అవినీతికి మీ మద్దతు.. ఎనిమిదేళ్లుగా జరిగింది ఇది కాదా ?

9. 2014లో యూపీఏ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి పెట్రలో ధర 71.41 ఉంటే.. ఇప్పుడు 119.66 ఉంది. డీజిల్ అప్పుడు 55.49 ఉంటే.. ఇప్పుడు 105.65 ఉంది. గ్యాస్ సిలెండర్ ధర అప్పుడు 470 ఇప్పుడు 1052కు ఎగబాకింది. నిత్యవరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల పెరుగుదలతో జనం చస్తుంటే చీమకుట్టినట్లు అయినా లేదా ? ఈ ధరల్లో 60 శాతం బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాల పన్నులే. మీరు తగ్గించాలంటే కాదు మీరు అంటూ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి ?

సెంటిమెంట్‌తో ప్రజల మనోభావాలతో ఆడుకునే మీ ప్రయత్నాలు ఫలించవంటూ అమిత్‌ షాకు రేవంత్ ఘాటుగా లేఖ రాశారు.

Also Read:Domestic Violence Case: ఇంట్లో గోడ.. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని మనవడిపై గృహహింస కేసు

Also Read: SVP Day 2 Collections: బాబు ల్యాండ్ అయితే బాక్సాఫీస్‌కు బ్యాండే.. ఎస్‌వీపీ రెండో రోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News