Where Is Cm Kcr: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు వరుస కార్యక్రమాలతో హీట్ పెంచుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా కమలం నేతలు కదిలివస్తున్నాయి. మహబూబ్ నగర్ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. ఈనెల 14న హైదరాబాద్ శివారు తుక్కుగూడలో జరగనున్న సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మే6న వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు హాజరయ్యారు. రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు రాహుల్ గాంధీ. చంచల్ గూడ జైలుకు వెళ్లారు. నెక్లెస్ రోడ్డులో నిర్మిస్తున్న అమరవీరుల సంస్మరణ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు.
బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించడమే కాదు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు. వరంగల్ సభలో కేసీఆర్ కేంద్రంగానే ప్రసంగించారు రాహుల్ గాంధీ. కేసీఆర్ పేరు ఎత్తకుండానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను రాజుగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజల ద్రోహి అన్నారు. ఇక జేపీ నడ్డా కూడా కేసీఆర్ లక్ష్యంగానే మాట్లాడారు. నియంత పాలనలో కేసీఆర్ నిజాంను మించి పోయారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా గతంలో ఎప్పుడు లేనంతగా గులాబీ బాస్ ను టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంత రచ్చ సాగుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం బయటికి రావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మంత్రులంతా విపక్షాల ఆరోపణలకు కౌంటరిస్తున్నా కేసీఆర్ మాత్రం ఎక్కడా స్పందించడం లేదు.
దాదాపు 10 రోజులుగా సీఎం కేసీఆర్ యాక్టివీస్ లేవు. ఏప్రిల్ 27న జరిగిన పార్టీ ప్లీనరీలో పాల్గొన్నారు కేసీఆర్. తర్వాత ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ప్రగతి భవన్ నుంచి బయటికి రాకున్నా.. కనీసం లోపల సమీక్షలు జరిపినట్లు కూడా సమాచారం లేదు. ఆయన ప్రగతి భవన్ లో కాకుండా ఫాంహౌజ్ లో ఉన్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంత రాజకీయ రచ్చ జరుగుతున్నా కేసీఆర్ ఫాంహౌజ్ లో సైలెంట్ గా ఎందుకు ఉన్నారని చర్చగా మారింది. కేసీఆర్ మౌనంపై రాజకీయ వర్గాల్లో పలు వాదనలు వినిపిస్తున్నాయి.
ఫాంహౌజ్ లో కేసీఆర్ పార్టీ బలోపేతం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహరచన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీకే టీమ్ ఇచ్చిన నివేదికలపై ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీలో తనకు అత్యంత నమ్మకంగా ఉన్న నేతలతో ఆయన నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. ఇక జాతీయ స్ఠాయిలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపైనా కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ముఖ్యనేతల సూచనలు తీసుకుంటున్నారని తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. కాంగ్రెస్, బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ప్రాంతీయ పార్టీల తరపున మూడో అభ్యర్థిని నిలబెట్టాలనే యోచనలో గులాబీ బాస్ ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చల్లో బిజీగా ఉండటం వల్లే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని సమాచారం.
మరోవైపు కేసీఆర్ సైలెంట్ గా ఉండటంపై టీఆర్ఎస్ పార్టీలో భిన్నవాదనలు వస్తున్నాయట. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుంటే కేసీఆర్ మౌనంగా ఉండటం సరికాదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ కౌంటర్ ఇవ్వకపోతే... ఆయన చేస్తున్న ఆరోపణలు జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందని.. ఇది పార్టీకి ప్రమాదకరంగా మారవచ్చని కొందరు కారు పార్టీ నేతలు కలవరపతున్నారు.
READ ALSO: Amithsha Book On Modi: దేశానికి మరో 25 ఏళ్లు మోడీనే ప్రధాని.. అమిత్ షా పుస్తకంలో అన్ని సంచలనాలే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Where Is Cm Kcr: సీఎం కేసీఆర్ ఎక్కడ..! ఫాంహౌజ్ లో ఏం చేస్తున్నారు?
టీఆర్ఎస్ ప్రభుత్వంపై నడ్డా, రాహుల్ విమర్శలు
తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటరివ్వని కేసీఆర్
కొన్ని రోజులుగా ఫాంహౌజ్ లోనే సీఎం కేసీఆర్