ONLINE SCAMS ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు అంతా డిజిటల్ మయం. అంతా డిజిటల్ ట్రాన్‌జాక్షన్స్‌లో పనులు జరిగిపోతున్నాయి. దీంతో మునుపటిలా జేబులో డబ్బులు పెట్టుకునే వాళ్లు తగ్గిపోయారు. సౌకర్యానికి సౌకర్యం ... సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉండడంతో చాలా మంది ఆన్‌లైన్ పేమెంట్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ. ఇక్కడ కరెన్సీ ఆంతా డిజిటల్ రూపంలో సంక్షిప్తం అవుతుంది. అన్ని ట్రాన్‌జాక్షన్స్ డిజిటల్ ఫార్మాట్‌లో జరిగిపోతాయి. అయితే ఇంత కాలం బ్యాంకుల ఆన్‌లైన్ అకౌంట్సను హ్యాక్ చేస్తూ వచ్చిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్, ఎథేరియమ్ వంటిపై పడ్డారు.
సైబర్ సేఫ్టీ పల్స్ నివేదిక ప్రకారం క్రిప్టో కరెన్సీలో కూడా మోసాలు పెరిగిపోయాయి. చాలా మంది కస్టమర్ల నుంచి కేటుగాళ్లు సైబర్ దాడులతో దోచుకెళ్తున్నారు. మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే కొంత మంది క్రిప్టో కరెన్సీపై పెట్టుబడి పెడుతున్నారు. సైబర్ సేఫ్టీ పల్స్ నివేదిక ప్రకారం మన దేశంలో కూడా చాలా మంది దగ్గర నుంచి క్రిప్టో కరెన్సీని దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ ఏడాది మన దేశంలో రోజుకు రూ.1.95 కోట్ల క్రిప్టో కరెన్సీ చోరీకి గురైందని నివేదిక వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఏకంగా 60,000 ఫిషింగ్ ప్రయత్నాలకు పాల్పడ్డారని తెలిపింది. అయితే ఇందులో 31,062 ప్రయత్నాలను సైబర్ సెక్యూరిటీ అడ్డుకుందని తెలిపింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రొఫైల్స్ సృష్టించి తప్పుడు సమాచారంతో మోసం చేస్తున్నారని తెలిపింది.
అయితే రానురాను ఈ సైబర్ మోసాలు దేశంలో పెరిగిపోతున్నాయని వివరించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో శరణార్థులకు సాయం చేసే పేరుతో పలువురి నుంచి చందాలు వసూలు చేయడంలో పెద్ద మొత్తంలో మోసం జరిగిందని పేర్కొంది. అయితే క్రిప్టో కరెన్సీకి నేరుగా బ్యాంకు ఖాతాలు ఉండవు కాబట్టి మోసం జరిగినప్పుడు తెలుసుకోవడం కష్టం అవుతోందని సైబర్ సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. అందుకే ముఖ్యంగా మోసగాళ్లు క్రిప్టోకరెన్సీలోనే వ్యవహారాలు నడుపుతున్నారని తెలిపింది. అందుకే ఇకపై ఆన్ లైన్ చెల్లింపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీని వాడకుండా ఉంటేనే మంచిదని సూచించింది. అయితే క్రిప్టో కరెన్సీ సంస్థలు కూడా సొంతగా సైబర్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకొని ఆన్‌లైన్ మోసాలు అడ్డుకట్ట వేస్తున్నాయి. పెద్ద మొతంలో జీతాలు ఆఫర్లు చేసి సైబర్ సెక్యూరిటీలో అనుభవం ఉన్న వారిని నియమించుకొని మరీ ఆన్‌లైన్ మోసాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిపోవడంతో ఆన్‌లైన్ మోసాలు తప్పడం లేదు.
also read Apple Payments Process: ఇండియాలో యాపిల్ పేమెంట్లకు బ్రేక్, మరి యాప్ పేమెంట్లు ఎలా చేయాలి
alsor read Whatsapp New Features: వాట్సప్‌లో ఇక అన్నీ రెట్టింపే, అందుబాటులో కొత్త ఫీచర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.