Kakani Govardhan Reddy : వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గురువారం (ఏప్రిల్ 21) సచివాలయంలోని రెండో బ్లాక్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కాకాని పూజలు చేశారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా తొలి సంతకం మెక్రో ఇరిగేషన్ ఫైల్‌పై చేశారు. రూ.1395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ కల్పించనున్నారు. రెండో సంతకం వైఎస్సా యంత్ర ఫైల్‌పై చేశారు. ఈ పథకం ద్వారా 3500 ట్రాక్టర్లను రైతులకు అందించనున్నారు.
మంత్రిగా బాధ్యతల స్వీకరణ అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... వ్యవసాయ శాఖ మంత్రిగా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వైసీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.43 వేలు కోట్లు కేటాయించామన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని... సీఎం జగన్ రైతు పక్షపాతి అని పేర్కొన్నారు.
రైతు సంక్షేమంలో భాగంగా రైతు భరోసా పథకం కింద రూ.20 వేల కోట్లు రైతులకు నగదు బదిలీ చేశామన్నారు. గన్నవరంలో స్టేట్ సీడ్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతుల నగదు లావాదేవీలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కాగా, కాకాని గోవర్దన్ రెడ్డికి మంత్రి పదవి దక్కాక తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో విభేదాలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. మంత్రి అయిన తర్వాత కాకాని తొలిసారి నెల్లూరు వెళ్లిన సందర్భంలో... అదే రోజు అనిల్ కుమార్ యాదవ్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయనే చర్చకు దారితీసింది. ఇద్దరి మధ్య విభేదాలు ముదరడంతో సీఎం జగన్ ఇద్దరినీ వేర్వేరుగా పిలిపించి మాట్లాడారు. దీంతో ప్రస్తుతానికి ఇద్దరి మధ్య విభేదాలు సమసినట్లయింది.
Also Read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ తదుపరి టార్గెట్ కర్ణాటకే, ఇవాళ కీలక సమావేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook