సీతారామ చరిత్రను తెలిపే రామాయణ తపాలా బిళ్ళలను భారత తపాలా శాఖ విడుదల చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోస్టల్ ఉన్నతాధికారులు తెలిపారు. సీతారామ చరిత్రను ప్రతిబింబించే రీతిలో రూపొందించిన 11 తపాలా బిళ్ళలతో కూడిన పోస్టర్ ను విడుదల దీపావళి సందర్భంగా విడుదల చేశారు. దీని ధర 65 రూపాయలు. శుభ సందర్భాల్లో బంధువులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు పోస్టల్ కవర్లపై అంటించి పంపించుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ 23, 2017న వారణాసిలోని తులసి మానస్ మందిర్ లో ప్రధాన మంత్రి రామాయణం ముఖ చిత్రంతో కూడిన 11 తపాలా బిళ్ళల పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీపావళి తరువాత రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ పోస్టర్ లభించనుంది.