Onion Cutting Tips: ఉల్లిపాయలు తరుగుతుంటే కన్నీళ్లు రాకుండా సింపుల్ టిప్స్..

Onions Cutting Tips: వంట చేసేటప్పుడు ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ల నుంచి నీళ్లు ధారలు కడుతుంటాయి. కొన్నిసార్లు ఆ ఘాటుకి ముక్కు నుంచి కూడా నీళ్లు కారొచ్చు. అలా కళ్ల నుంచి నీళ్లు కారకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 11:05 PM IST
  • ఉల్లిపాయలు తరిగేందుకు టిప్స్
  • కన్నీళ్లు రాకుండా ఉండేందుకు ఇలా చేయొచ్చు
  • వెనిగర్, నిమ్మకాయలతో కూడిన టిప్స్ మీ కోసం
Onion Cutting Tips: ఉల్లిపాయలు తరుగుతుంటే కన్నీళ్లు రాకుండా సింపుల్ టిప్స్..

Onions Cutting without Tears: కూరల్లో ఉల్లిపాయ ఎంత టేస్టీగా ఉంటుందో.. దాన్ని తరిగేటప్పుడు అంత సినిమా కనిపిస్తుంది. కళ్ల నుంచి నీళ్లు ధారలు కడుతాయి. ఉల్లికి ఉండే ఘాటు కారణంగా కళ్లు మంటలు పుడుతాయి. అయితే కళ్ల నుంచి నీళ్లు రాకుండా ఉల్లిపాయలు ఎలా కట్ చేయవచ్చో మీకు తెలుసా..  

ఉల్లిపాయను కట్ చేసే ముందు ఇలా చేయండి..:

ఉల్లిపాయను కోసే ముందు వెనిగర్‌లో కాసేపు ఉంచితే.. కోసేటప్పుడు కళ్లలో నీళ్లు రావు. ఉల్లిపాయను కోసే ముందు 2 లేదా మూడు గంటలు ఫ్రిజ్‌లో ఉంచినా.. కోసేటప్పుడు కళ్ల నుంచి నీళ్లు రావు. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ కోసేటప్పుడు విడుదలయ్యే ఘాటు తక్కుతుంది. ఉల్లిలో ఉండే ఎంజైమ్స్ తక్కువ పరిమాణంలో విడుదలవడం వల్ల కళ్లకు నీళ్లు రాకుండా ఉంటాయి.

ఉల్లిపాయను కింది వైపు నుంచి కోయండి :

ఉల్లిపాయను కోసేటప్పుడు.. పై భాగం నుంచి కాకుండా కింది వైపు నుంచి కోయండి. తద్వారా ఉల్లిపాయను త్వరగా కట్ చేయవచ్చు. అలాగే, మీ కళ్లలో నీళ్లు అంతగా రావు.

నిమ్మకాయను ఉపయోగించండి:

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లల్లో నిమ్మకాయలు ఉంటాయి. ఉల్లిపాయలు కోసేటప్పుడు నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఉల్లిపాయను కోసే ముందు.. కత్తిపై కొద్దిగా నిమ్మరసం రాయండి. ఇలా చేయడం వల్ల.. ఉల్లిపాయను కోసేటప్పుడు మీ కళ్ల నుంచి నీళ్లు రావు. 

ఈ టిప్స్ కూడా ట్రై చేయొచ్చు :

ఉల్లిపాయలు కోసేటప్పుడు కొవ్వొత్తి లేదా దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల, ఉల్లిపాయ నుంచి విడుదలయ్యే గ్యాస్.. కొవ్వొత్తి లేదా దీపం వైపు వెళ్తుంది. కాబట్టి మీ కళ్ళ నుంచి కన్నీళ్లు రావు. అంతేకాదు, ఉల్లిపాయలు కోసేటప్పుడు రొట్టె ముక్కను నోట్లో పెట్టుకుని నమిలినా కన్నీళ్లు రావు. ఉల్లిపాయను కోసేముందు.. కొద్దిసేపు సూర్యకాంతిలో ఉంచినా కళ్ల నుంచి నీళ్లు రావని చెబుతారు. 

Also Read: Bheemla Nayak Trailer Talk: ఆ ఒక్కటి ఫ్యాన్స్‌ను బాగా డిసప్పాయింట్ చేసిందా? ఆర్జీవీ రియాక్షన్ ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News