Shilpa Shetty's Pushpa Dance: శిల్పా శెట్టికి పుష్ప ఫీవర్.. సామీ సామీ అంటూ స్టెప్పులు

Shilpa Shetty's Pushpa Dance: పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా ఇప్పట్లో తగ్గేట్టు లేదు. ఎక్కడ చూసినా ఇదే మేనియా కన్పిస్తోంది. పుష్ప పాటలకు స్టెప్పులేయని సెలెబ్రిటీ లేరంటే అతిశయోక్తి కానే కాదు. ఇప్పుడు కొత్తగాత శిల్పాశెట్టి వేసిన స్టెప్పులు హల్‌చల్ చేస్తున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 11, 2022, 12:04 PM IST
Shilpa Shetty's Pushpa Dance: శిల్పా శెట్టికి పుష్ప ఫీవర్.. సామీ సామీ అంటూ స్టెప్పులు

Shilpa Shetty's Pushpa Dance: పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా ఇప్పట్లో తగ్గేట్టు లేదు. ఎక్కడ చూసినా ఇదే మేనియా కన్పిస్తోంది. పుష్ప పాటలకు స్టెప్పులేయని సెలెబ్రిటీ లేరంటే అతిశయోక్తి కానే కాదు. ఇప్పుడు కొత్తగాత శిల్పాశెట్టి వేసిన స్టెప్పులు హల్‌చల్ చేస్తున్నాయి.

తెలుగు పాన్ ఇండియా మూవీ పుష్ప రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం, లెక్కల మాస్టారు తెరకెక్కించిన కధనం ఓ ఎత్తైతే పాటలు..పాటల్లోని స్టెప్పులు మరో ఎత్తు. పాటల్లో స్టెప్పులు చాలా భిన్నంగా ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అందుకే బాక్సాఫీసు వద్ద ఇప్పటికీ కలెక్షన్లు కురిపిస్తూనే ఉంది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కావడంతో ఎక్కువమందికి చేరుతోంది ఈ సినిమా. శ్రీవల్లి పాటకు హుక్ స్టెప్పులు, సామీ సామీ పాటకు రష్మిక వేసిన స్టెప్పులు అందర్నీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఒక్క సెలెబ్రిటీ అదే పనిగా స్టెప్పులేస్తూ..వీడియోలు విడుదల చేస్తున్నారు. అవి కాస్తా ట్రెండింగ్ అవుతున్నాయి. 

ఇప్పుడు తాజాగా మరో సెలెబ్రిటీ పుష్ప సినిమాలోని సామీ సామీ పాటకు స్టెప్పులేసి హల్‌చల్ చేసింది. ఇతర జట్టు సభ్యులతో కలిసి శిల్పా శెట్టి (Shilpa Shetty)స్టెప్పుల వీడియా కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ తరువాత ప్రముఖ ర్యాపర్ బాద్‌షా సైతం ఇవే స్టెప్పులేసి సంచలనం రేపాడు. అభిమాని కావచ్చు..సెలెబ్రిటీ కావచ్చు అందరికీ పుష్ప మేనియా పట్టుకుంది. ఓ టీవీ ఛానెల్ షోలో భాగంగా కొంతమంది అమ్మాయిలు పుష్ప సినిమాలోని సామీ సామీ పాట డ్యాన్స్ వేయగా, శిల్పాశెట్టి, బాద్ షాలు అనుకరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Also read: Unstoppable: అలా చేస్తేనే ఎక్కడో కాలుతుందంటున్న బాలయ్య, అసలేమైంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News